Saturday, April 27, 2024

ఒమిక్రాన్ బూస్టర్ వ్యాక్సిన్‌కు డిసిజిఐ అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొవిడ్ 19 వేరియంట్ ఒమిక్రాన్‌ను నివారించే ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్ “జెమ్ కొవాక్ ఒఎమ్ ”ను అత్యవసరంగా వినియోగించడానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి)సమన్వయంతో స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించి “మిషన్ కొవిడ్ సురక్ష” కింద జెనోవా బయోఫార్మాక్యూటికల్స్ సంస్థ తయారు చేసింది. రోగులు ఎవరైనా కొవిషీల్డ్, కొవాక్సిన్ టీకాలు వేయించుకున్నా బూస్టర్ డోస్‌గా ఈ ఒమిక్రాన్ వ్యాక్సిన్‌ను వేసుకోవచ్చు.

ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత ఇతర వ్యాక్సిన్ల మాదిరిగా ఈ వ్యాక్సిన్‌కు అతిశీతల సరఫరా వ్యవస్థ అవసరం లేదు. దేశంలో ఎక్కడికైనా ఎటువంటి ఉష్ణోగ్రతల్లో నైనా సరఫరా చేయవచ్చు. సంప్రదాయ సిరంజీలు, సూదులు అవసరం లేకుండా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. వేగంగా అందుబాటు లోకి తీసుకురాడానికి తాము చేసిన ప్రయత్నాలకు ఈ అనుమతి రావడమే సాక్షంగా జెనోవా బయోఫార్మాక్యూటికల్స్ సంస్థ సిఇఒ సంజయ్ సింగ్ చెప్పారు. సాధారణంగా వ్యాక్సిన్ల సరఫరాకు దేశంలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు సౌకర్యం కల్పించ వలసి ఉంటుంది.

కానీ ఈ బూస్టర్ ఒమిక్రాన్ వ్యాక్సిన్‌కు సరఫరా చేయాలన్నా నిల్వ చేయాలన్నా అతిశీతల ఉష్ణోగ్రత పరిస్థితి అవసరం లేదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత డిసీజ్ యాగ్నోస్టిక్ ప్లాట్‌ఫారం టెక్నాలజీ ఉపయోగించి ఈ జెమ్ కొవాక్ ఒఎం వ్యాక్సిన్‌ను తయారు చేయడమైందని డిబిటి సెక్రటరీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చి అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్‌ఎసి) ఛైర్ పర్మన్ రాజేష్ ఎస్ గోఖలే వెల్లడించారు. ఇదే టెక్నాలజీతో మరికొన్ని వ్యాక్సిన్లను త్వరలో తయారు చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News