Monday, April 29, 2024

ఇప్పటికైతే భద్రమే

- Advertisement -
- Advertisement -

Decreasing in Bhadrachalam Godavari flood

భద్రాచలంలో తగ్గుతున్న
గోదావరి వరద
68 అడుగులకు చేరిన
నీటిమట్టం కొనసాగుతున్న
మూడో ప్రమాద హెచ్చరిక
ఇంకా ముంపులోనే గ్రామాలు
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
195మంది పారిశుధ్య
సిబ్బంది, 10 జెట్టింగ్
మిషన్ల తరలింపు వరద
ప్రాంతాల్లో అంటువ్యాధులు
ప్రబలకుండా చర్యలు
కృష్ణా బేసిన్‌కు వరద, 100
టిఎంసిలకు చేరువలో
శ్రీశైలం మరో రెండ్రోజులు
భారీ వర్షాలు

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: భద్రాద్రి వద్ద గోదారమ్మ శాంతించింది. 36 ఏళ్ల తరువాత మరోసారి మహాగ్రరూపం దాల్చిన గోదావరి శ నివారం ఉదయం క్రమేపి తగ్గుము ఖం పట్టడంతో జిల్లా అధికార యం త్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గడంవల్ల శనివారం రాత్రి భద్రాద్రి వద్ద 68 అడుగులకు నీటి మట్టం చే రుకుంది. 22 లక్షల క్యూసెకుల వరద ప్రవాహం కొనసాగుతుంది. అయినా ముంపు మాత్రం ఇంకా వీ డలేదు. భద్రాద్రి ముంపు ప్రాంతాల ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ఏరియల్ సర్వేచేసి అనంతరం భద్రాచలంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేయనుండగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై కూడా నేడు భద్రాచలం వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ద్రాచలం వద్ద శుక్రవారం 70అడుగులకు పైగా వరద నీరు చేరి జళ ప్రళయం సృష్టించిన గోదావరి శనివారం ఉదయం నుంచి క్రమేపి శాంతించింది. శుక్రవారం ఆర్ధరాత్రి 12గంటలకు 71.20 అడుగుల ఉన్న నీటి మట్టం నెమ్మదిగా తగ్గతూ శనివారం రాత్రి 10గంటలకు 67అడుగులకు పడిపోయింది.

సమ్మక్క సారక్క, లక్ష్మి బ్యారేజీ నుంచి ఇన్‌ఫ్లో తగ్గడం వల్ల ఇక్కడ గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గంటగంటకు ఒక్కో పాయింట్ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రానికల్లా మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ వరద సహాయక కేంద్రాల్లో ఉన్న వరద బాధితులు మరో రెండు, మూడు రోజుల పాటు ఇక్కడే ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్న తరువాత గోదావరి నీటి మట్టం నిలకడగా మారి పూర్తిగా తగ్గిన తరువాత వరద బాధితులు తమ ఇళ్లకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు.

వరదల వల్ల భద్రాచలం, పాల్వంచ డివిజన్ లోని 9 మండలాల్లో 87 గ్రామాలకు చెందిన 7545 కుటుంబాలకు చెందిన మొత్తం 25,975 మంది ముంపు ప్రజలు ఇంకా 78పునరావస కేంద్రాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంతేగాక వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. రోడ్లు తెగిపోయాయి. ప్రజారవాణ, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. భద్రాచలం పట్టణంలో సుభాస్‌నగర్ కాలనీ, అయ్యప్పకాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ఉదయం గోదారమ్మ శాంతించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు నది హారతి ఇచ్చి ఉగ్రరూపంలో ఉన్న గోదావరి నెమ్మదించాలని ఆయన ప్రార్థించారు. ఆ తరువాత ఆయన గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులతో ముచ్చటించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గొన్ని బాధితులకు దైర్యం చెప్పి పునరావస కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు. ఈ సందర్భంగా భద్రాచలం.. చర్ల ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎటపాక వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను అదేశించారు. ఆ తరువాత పునరావస కేంద్రాలను తనిఖీ చేశారు. మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మంత్రి వరద బాధితులకు భరోసా ఇచ్చారు. ఆహారం, త్రాగు నీరు, వైద్యం, విద్యుత్ తదితర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఐటిడిఏ సమావేశ మందిరంలో వరద సహాయక చర్యలు, వరద ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఉన్నత స్దాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వరదల ప్రత్యేక అధికారులు సిసిఎల్‌ఏ డైరెక్టర్ రజత్‌కుమార్ షైనీ, సింగరేణి సిఎండి శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ఐటిడిఏ పివో గౌతమ్, జడ్పి చైర్మన్ కోరం కనకయ్య తదితరు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడ్తూ వరద సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగం చేసిన సేవలను అభినందించారు. వరదల వల్ల కలిగిన నష్టాన్ని శాఖలవారిగా నివేదికలు తయారు చేయాలని, వరదలు తగ్గిన తరువాత సాధారణ స్థ్థితికి తీసుకురావడమే అధికారుల ముందు ఉన్న అసలైన టాస్క్ అని మంత్రి అన్నారు. వరదల నష్టాన్ని, పునరుద్ధరణకోసం అంచనాలు తయారు చేయాలని మంత్రి అదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డా జి శ్రీనివాసరావును నియమించారు. వరద ప్రభావితా ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి అంటూ వ్యాధులు ప్రభలకుండా పలు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు.

నేడు భద్రాచలం వద్ద సిఎం ఏరియల్ సర్వే
భద్రాచలం డివిజన్‌లో గోదావరి వరదల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ఏరియల్ సర్వే చేయనున్నారు ఉదయం ఏడు గంటలకు వరంగల్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా భద్రాచలం వరకు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆ తరువాత స్దానిక ఐటిడిఏ సమావేశమందిరంలో స్దానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజా ప్రతినిధులుఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు.అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ తమిళీసై కూడా ఆదివారం భద్రాద్రి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు అయితే ఆమె పర్యటన ఇంకా అధికారికంగా ఖారారు కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News