Saturday, April 27, 2024

వీధి కుక్కల దాడిలో జింక మృతి

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ సమ్మక్క, సారక్క వద్ద నూతనంగా నిర్మించిన ఈకో ఫారెస్ట్‌లో మరో జింక ఊర కుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ సమ్మక్క, సారక్క వద్ద ఈకో ఫారెస్టులో 15 రోజుల క్రితం 18 జింకలను ఫారెస్ట్‌లో వదిలిన అటవీ శాఖ అధికారులు… జింకలను వదిలిన రెండు రోజులు తర్వాత కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది. గురువారం ఉదయం తెల్లవారుజామున తిరుమలయగట్టు సమీపంలో పంట పొలాలకు జింకలు రాగా వీధికుక్కలు వెంటపడి హత మార్చాయని స్థానికులు తెలిపారు. వరుస జింకలు మృత్యువాత పడటంతో సందర్శకులు, స్థానికులు అధికారులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు కొన్ని లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి, పెన్షింగ్ పనులు చేశారని,

కానీ పెన్సింగ్ మాత్రం రోడ్డుకి ముందు భాగంలోనే వేసి చుట్టుపక్కల, వెనుక భాగం ఫెన్సింగ్ చేయలేదని, అదే జరిగి ఉంటే జింకలు మృతి చెందేవి కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ పెన్సింగ్ లేకపోవటంతో వన్యప్రాణులు, గ్రామాల్లోకి వస్తున్నాయని, వీటిని వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని, వేసవికాలం కావడంతో ఫారెస్ట్ అధికారులు, వన్య ప్రాణులకు సరైన సదుపాయాలు సమకూర్చటంలో విఫలమైయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ విధంగా వన్యప్రాణులు మృతి చెందుతుంటే … రాబోయే రోజుల్లో ఈకో పారెస్ట్‌లో మిగిలిన జింకలు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు కళ్లు తెరుచుకొని వన్య ప్రాణులను అంతరించి పోకుండా తగిన చర్యలు తీసుకొని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News