Sunday, May 5, 2024

వచ్చే ఏడాది ప్రజాసందర్శనకు ఢిల్లీ అసెంబ్లీ భవనం రహస్య సొరంగం

- Advertisement -
- Advertisement -

Delhi Assembly secret tunnel for public visit next year

 

ఈలోగా శాస్త్రీయ పరిశోధనపై నిర్ధారణ అవసరమని నిపుణుల సూచన

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ భవనం దిగువన ఉన్న రహస్య సొరంగం గురించి చారిత్రక నిర్ధారణకు వచ్చే ముందు సమగ్రంగా అన్ని కోణాల్లో పరిశోధన జరగాల్సి ఉందని పురావస్తు, శాస్త్రవేత్తలతో సహా వివిధ రంగాల నిపుణులు, మేథావులు అభిప్రాయం వెలిబుచ్చారు. వచ్చే సంవత్సరం ప్రజాసందర్శనకు ఈ సొరంగాన్ని సిద్ధం చేయనున్నారు. ప్రజలకు సందర్శించే అవకాశం కల్పించేటప్పుడు తప్పనిసరిగా దీనిపై పరిశోధనలు జరగాలని ఢిల్లీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త , అర్బన్ ప్లానర్ ఎజికె మీనన్ అభిప్రాయపడ్డారు.

ఈ సొరంగం గురించి మొట్టమొదట 2016 లో అందరికీ తెలిసింది. అప్పటినుంచి అనేక ఊహాగానాలు, వివాదాలు ముసురు కుంటున్నాయి. ఈ సొరంగ ముఖ ద్వారం ఢిల్లీ అసెంబ్లీ భవనం హాలు దిగువన ఉంది. దేశ రాజధాని కొల్‌కతా నుంచి ఢిల్లీకి మారిన తరువాత బ్రిటిష్ కాలంలో 1912 లో నిర్మాణమైనట్టు చెబుతున్నారు. ఈ సొరంగ మార్గం ఎర్రకోట వరకు , అలాగే యమునా నది వరకు ఉన్నట్టు ఊహిస్తున్నారు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ సొరంగం గురించి చారిత్రక వాస్తవాల ఆధారంగా నిర్ధారణ కావలసి ఉందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ అభిప్రాయ పడ్డారు. వచ్చే సంవత్సరం దీన్ని ప్రజాసందర్శనకు అనుమతించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News