Monday, April 29, 2024

కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ ఖర్చుపై ఢిల్లీ ఎల్‌జి ఆరా

- Advertisement -
- Advertisement -

15 రోజుల్లో నివేదిక పంపాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశం

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ అధికార నివాసం పునరుద్ధరణ కోసం రూ.44.78 కోట్లు వెచ్చించడంపై సంబంధిత ఫైళ్లు, రికార్డులను పరిశీలించి 15 రోజుల్లో నివేదిక పంపాలని చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శికి ఈనెల 27న ఎల్‌జి కార్యాలయం లేఖ రాసింది. ఇందులో కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ మీడియాలో కథనాలు వెలువడడమే కాకుండా, అవినీతి చోటు చేసుకుందని బీజేపీ ఆరోపించింది.

Also Read: ముఖ్తర్ అన్సారీకి పదేళ్లు జైలు శిక్ష

రూ.10 కోట్లు ఖర్చు దాటితే లెఫ్టినెంట్ గవర్నర్ స్క్రూటినీ పరిధి లోకి వస్తుందని, ఆయన పరిధి లోకి రాకుండా చూసేందుకు తక్కువ ఖర్చు చూపించారని బీజేపీ ఆరోపించింది. “ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఖర్చు రూ. 9.99 కోట్లు ఇంత కచ్చితంగా ఎలా లెక్కలు వేశారో తెలియడం లేదని బీజేపీ వ్యాఖ్యానించింది. ఇది తెలివిగా మదింపు చేసినట్టు గానే చెప్పాలని, దీన్ని బట్టి అవినీతి చాలా స్పష్టంగా జరిగినట్టు తెలుస్తోందని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. ఇవన్నీ పరిగణన లోకి తీసుకున్నట్టు ఎల్‌జి కార్యాలయం పేర్కొంది. దీనిపై ఆప్ నేతలు మండి పడ్డారు. 80 ఏళ్ల కిందట 1942లో నిర్మించిన సిఎం అధికార నివాసంలో ఇప్పటికే మూడు సార్లు పైకప్పు కూలిన సంఘటనలు జరిగాయని తెలిపారు.

Also Read: #Nani30లో శ్రుతి హాసన్

ఎల్జీ నివాసానికి మరమ్మతు పనుల కోసం రూ. 15 కోట్లు కాగా, ప్రధాని మోడీ అధికార నివాసం కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. బీజేపీ అనేక ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సిఎం నివాసానికి రూ. 45 కోట్లు ఖర్చు చేశారంటూ యాగీ చేస్తోందని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ధ్వజమెత్తారు. పుల్వామా దాడి, అదానీ వివాదం వంటి అంశాలపై సీఎం నివాసంలో చర్చ జరగకుండా చేసేందుకు బీజేపీ ఈ ప్రయత్నాలకు దిగిందని మండి పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News