Monday, April 29, 2024

పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలు అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మున్సిపాలిటీలు అభివృద్ధి పదంలో ముందుకు సాగతున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, స్ధానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియానాయక్‌లు అన్నారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక మార్కెట్ యార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా పాల్గొని మాట్లాడారు.

పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలకు అధిక నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని వాటితో పట్టణాలు కొత్తరూపులు సంతరించుకున్నాయన్నారు. ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పులు తీసుకరావడానికి ప్రణాళికబద్ధంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీల ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్స్, విద్యుత్ సమస్యలు, వైకుంఠధామాలు, మొక్కలునాటడం, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్‌లు, డంపింగ్‌యార్డులతో పాటు అనేక కార్యక్రమాలను పట్టణ ప్రగతిలో చేపట్టారన్నారు.

అందులో భాగంగానే ఇల్లందు మున్సిపాలిటీ రెండుసార్లు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికై జిల్లాలో ప్రధమంగా నిలించిందన్నారు. అనంతరం మున్సిపాలిటీని ప్రగతిపధంలో నడిపించడానికి కారకులైన పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయసంస్ధ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మన్ జానీపాష, మున్సిపల్ కమిషనర్ అంకుషావళి, తహసీల్దార్ కృష్ణవేణి, ఎమ్‌పిడిఒ బాలరాజు, సిడిపిఒ లక్ష్మిప్రసన్న, జిల్లా రైతు సమన్యయ సమితి సభ్యులు పులిగళ్ళ మాధవ్‌రావు, మున్సిపల్ కౌన్సెలర్లు, మున్సిపల్ అధికారులు, మెప్మాసిబ్బంది, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News