Tuesday, April 30, 2024

మేఘాలలో హరివిల్లులా…

- Advertisement -
- Advertisement -

Deyyam tho sahajeevanam movie

 

బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు? వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మా యి ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంది? అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డిఎస్‌జె’ (దెయ్యంతో సహజీవనం). అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రముఖ పాత్రలో నటించింది. నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటి ంగ్ పూర్తి చేసుకుంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16న ఈ చిత్రాన్ని 5 భాషల్లో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చిన్మయి పాడిన ‘మేఘాలలో హరివిల్లులా’ అనే అద్భుతమైన పాటను మ్యాంగో మ్యూజి క్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ “కాశ్మీర్‌లోని అద్భుతమైన అందాలతో 5 రోజులు షూట్ చేసిన ‘మేఘాలలో హరివిల్లులా’ పాట ను చిన్మయి పాడింది. ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేశాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. ఈ నెల 16న 5 భాషలలో ఒకేసారి మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News