Saturday, May 4, 2024

భారత్ ప్రతిష్టను ధ్యాన్ చంద్ అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్ళారు: పోచారం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ధ్యాన్ చంద్ కి తన శ్రద్ధాంజలి అంటూ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ద్యానచంద్ జయంతి) సందర్భంగా యువజన మరియు క్రీడా సంక్షేమ శాఖల ఆద్వర్యంలో బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

ముందుగా మేజర్ ద్యానచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్పీకర్ నివాళులర్పించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  హాకీ లో తన ప్రతిభతో వ్యక్తిగతంగా ప్రపంచంలోనే అత్యధికంగా గోల్స్ చేసిన హాకీ మాంత్రికుడు ద్యానచంద్ చరిత్రి సృష్టించారని కొనియాడారు. అంతటి గొప్ప క్రీడాకారుని జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు మనం ఘనంగా అర్పించే నివాళి అని పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లో పుట్టి ఆసక్తితో, స్వయంకృషితో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న క్రీడాకారులకు తన అభినందనలు అని,  బాన్సువాడ పట్టణంలోని క్రీడాకారుల సౌలభ్యం కోసం అన్ని వసతులతో మినీ స్టేడియం నిర్మించామన్నారు.

ఈ స్టేడియంలోని వసతులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పోచారం సూచించారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గం లోని వ్యాయామ ఉపాద్యాయులను, బాన్సువాడ నియోజకవర్గం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో ప్రాతినిధ్యం వహించిన స్థానిక క్రీడాకారులను సభాపతి పోచారం సన్మానించారు. ఈ కారక్రమంలో ఆర్ డిఒ రాజా గౌడ్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు,
బాన్సువాడ పట్టణంలోని విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News