Monday, April 29, 2024

బొగ్గు కుంభకోణం కేసు: మాజీ కేంద్రమంత్రికి జీవిత ఖైదు విధించాలి

- Advertisement -
- Advertisement -

 Dilip Roy should be sentenced to life imprisonment: CBI

 

ఢిల్లీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించిన సిబిఐ

న్యూఢిల్లీ : 1999లో జార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో దోషిగా తేలిన మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రాయ్‌కు జీవిత ఖైదు శిక్ష విధించాలని ఢిల్లీ ప్రత్యేక కోర్టును సిబిఐ అభ్యర్థించింది. సిబిఐ, సాక్షుల వాదనలను విన్న తరువాత ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ భరత్ పరాశర్ తన తీర్పును ఈనెల 26కి వాయిదా వేశారు. అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వంలో బొగ్గుగనుల సహాయ మంత్రిగా పనిచేసిన రాయ్‌తోపాటు బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రదీప్‌కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్, క్యాస్ట్రాన్ టెక్నాలజీస్ (సిటిఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాలా తదితరులకు కూడా జీవితఖైదు విధించాలని సిబిఐ కోరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News