Friday, May 3, 2024

ఖాతా లేనోళ్లకు చేతికే నగదు

- Advertisement -
- Advertisement -

post office

 

కొత్తగా మరో 3.12 లక్షల వలస కార్మికుల గుర్తింపు
రూ. 12 కోట్లతో 3746 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా
రూ. 15.60 కోట్లతో ఒక్కొక్కరికి రూ. 500 నగదు పంపిణి
మొత్తం రెండు విడతల్లో రూ. 57.60 కోట్ల సహాయం
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : బ్యాంకు ఖాతాలు లభించని వారికి పోస్టాఫీసుల ద్వారా రూ.1500 నగదుకు సుమారు ఐదు లక్షల మందికి అందించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి రూ. 78,24, 55,500 పోస్ట్ మాస్టర్ జర్నల్, హైదరాబాద్ ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆయన వివరించారు. శనివారంనాడు సోమాజీగూడాలో పౌరసరఫరాల శాఖ ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్-19 నియంత్రణకు లాక్ డౌన్ అమలు నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు, వలస కార్మికులకు సిఎం కెసిఆర్ ఆపన్న హస్తాన్ని అందించారన్నారు. ఇందులో భాగంగానే తెల్లరేషన్ కార్డుదారులకు రూ. 1500 నగదు, కుటుంబంలోని ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యం, వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం రూ.500 నగదును అందించి వారికి అండగా నిలిచారని అన్నారు.

87.54 లక్షల కుటుంబాలకుగాను ఇప్పటికే 79.57 లక్షల (91%) కార్డుదారులకు ఉచితంగా 3 లక్షల 13 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు ఉన్న 74,07,186 కుటుంబాలకు రూ. 1500 చొప్పున రూ. 1,112 కోట్లు ఖాతాలో జమ చేయడం జరిగింది. మిగిలిన కుటుంబాల్లో 5,21,641 కార్డుదారులకు బ్యాంక్ అకౌంట్ లేదని గుర్తించి, వీరికి పోస్ట్ ఆఫీస్ ద్వారా నగదును అందిస్తున్నామని ప్రకటించారు. ప్రతి ఒక్క పేదవాణ్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనిని ఆయన భరోసా ఇచ్చారు. ఈ నెలలో మొత్తం 15.63 లక్షల పోర్టబిలిటీ లావాదేవీలు జరిగాయని వివరించారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్-లో 3.40 లక్షలు, మేడ్చల్-లో 2.33 లక్షలు, రంగారెడ్డిలో 1.65 లక్షలు, వరంగల్-లో 72 వేలు మంది రేషన్ పోర్టబిలిటీని ఉపయోగించారని తెలిపారు.

వలస కార్మికులకు చేయుత
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో స్థిరపడిన వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందిస్తోందని మారెడ్డి తెలిపారు. తొలి విడతలో 3 లక్షల 35 వేల మంది వలస కార్మికులను గుర్తించి, ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున మొత్తం రూ. 13 కోట్ల విలువ చేసే 4028 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అలాగే రూ. 500 చొప్పున మొదటి విడతలో రూ. 17 కోట్లు, మొత్తం రూ. 30 కోట్లతో వారిని ఆదుకోవడం జరిగిందని వివరించారు. కాగా రెండో విడతలో మరో 3 లక్షల 12 వేల మందిని గుర్తించడం జరిగిందన్నారు. వీరికి రూ. 12 కోట్ల విలువ చేసే 3746 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 12 కిలోలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున రూ. 15.60 కోట్లు నగదును అందిస్తామన్నారు. వలస కార్మికులకు బియ్యం పంపిణీలో ఏమాత్రం ఆలస్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని
అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు.

 

Direct cash to those who do not have Bank account
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News