Saturday, May 4, 2024

ఘన విజయం దిశగా ‘డిస్కో రాజా’

- Advertisement -
- Advertisement -

Disco Raja

 

రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్కోరాజా’ చిత్రం తాజాగా విడుదలై హిట్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. నభానటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్‌తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లో బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌తో పాటు రవితేజ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ “ఈ సినిమాలోని నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. విఐ ఆనంద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. రామ్ తాళ్లూరి ప్యాషనేట్ నిర్మాత. ఆయన తన సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది”అని అన్నారు. దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ “సినిమాలో రవితేజ నటన హైలైట్‌గా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. సునీల్ పాత్ర చాలా బాగా వచ్చింది. అబ్బూరి డైలాగ్స్ చాలా బాగున్నాయి”అని చెప్పారు.

Disco Raja Triumph Celebrations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News