Friday, May 10, 2024

జిల్లా ఆసుపత్రుల్లో లక్ష మందికి సగటున 24 పడకలే!

- Advertisement -
- Advertisement -

బీహార్‌లో మరీ అధ్వానం: నీతి ఆయోగ్

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి జిల్లా ఆసుపత్రుల్లో లక్ష మంది జనాభాకు సగటున 24 పడకలే ఉన్నాయని, బీహార్‌లో కనిష్ఠంగా  6 పడకలే ఉన్నాయని, పుదుచ్ఛేరిలో అత్యధికంగా 222 బెడ్లు ఉన్నాయని ప్రభుత్వ మేధోసంస్థ(థింక్ ట్యాంక్) ‘నీతి ఆయోగ్’ వెల్లడించింది. ‘బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద పర్‌ఫార్మెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్’ అనే అధ్యయనాన్ని గురువారం నీతి ఆయోగ్ విడుదలచేసింది.

2018-19లో 36 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలలోని 707 ఆసుపత్రులలో అధ్యయనం చేశాక తయారుచేసిన ఓ నివేదికలో జిల్లా ఆసుపత్రుల్లో లక్ష మంది జనాభాకు కనీసం 22 పడకలైనా నిర్వహించాలని(2001 జిల్లా సగటు జనాభా గణాంకాల ప్రకారం), 2012లో భారతీయ ప్రజారోగ్య ప్రమాణాల(ఐపిహెచ్‌ఎస్) మార్గదర్శకాలను సిఫార్సు చేశారు.

‘భారత్‌లో జిల్లా ఆసుపత్రుల్లో ప్రతి లక్ష మంది జనాభాకు 1 నుంచి 408 రేంజిలో పడకలు ఉన్నాయి. కాగా 217 జిల్లాల్లో ప్రతి లక్ష మందికి 22 పడకలే ఉండడాన్ని కనుగొన్నాము’ అని నీతి ఆయోగ్ పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి పెట్రేగిపోయిన నేపథ్యంలో ఈ అధ్యయనం విశిష్టతను సంతరించుకుంది. జిల్లా స్థాయిలో ప్రజారోగ్య మౌలికవసతి ఎంత అధానంగా ఉందో కూడా దీని ద్వారా అర్థమవుతోంది. కోవిడ్ -19 రెండో వేవ్ కాలంలో ప్రజారోగ్య పరిస్థితి కళ్లకు కట్టినట్టు అవగతమైంది.

నీతి ఆయోగ్ తన నివేదిక ద్వారా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఎన్నెన్ని పడకలు ఉన్నాయన్నది వెల్లడించింది. ఈ నివేదికను ప్రస్తుత నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్, సిఇఒ అమితాబ్ కాంత్, భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ రోదెరికో ఆఫ్రిన్, ఇతర సీనియర్ అధికారులు ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News