Friday, April 26, 2024

క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్, ఫెదరర్

- Advertisement -
- Advertisement -

Djokovic and Federer

 

మెల్‌బోర్న్: ఈ ఏడాది తొలి గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, కెనడాకు చెందిన మిలోస్ రావోనిక్‌లు పురుషుల సింగిల్స్ విభాగంలో క్యార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. కాగా మహిళల విభాగంలో ఆదినుంచి సంచనాలకు నిలయంగా మారిన అమెరికా టీనేజ్ సంచలనం కోకో గౌఫ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది.

హోరాహోరీగా జరిగిన పోరులో అమెరికాకు చెందిన సోఫియా కెనిన్ చేతిలో 7 6,3 6, 06 స్కోరుతో పరాజయం పాలవడంతో గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను దక్కించుకొని చరిత్ర సృష్టించాలనుకున్న ఈ 15 ఏళ్ల చిన్నారి కలలు కల్లలయ్యాయి. ఓటమి తర్వాత గౌఫ్ కన్నీటి పర్యంతమైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ 6 3, 6 4, 6 4 స్కోరుతో అర్జెంటీనాకు చెందిన డీగో ష్వార్ట్‌మన్‌ను ఓడించి 11వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు.

ఏడుసార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్న జకోవిచ్ కేవలం రెండు గంటల్లోనే ప్రత్యర్థిని వరస సెట్లలో చిత్తు చేయడం ద్వారా మరో సారి ఈ టైటిల్‌ను దక్కించుకునే సత్తా తనలో ఇంకా ఉందని నిరూపించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ కెనడాకు చెందిన మిలోస్ రవోనిక్‌ను ఢీకొంటాడు. నాలుగో రౌండ్ మ్యాచ్‌లో రవోనిక్ 6 4,6 3,7 5 స్కోరుతో మాజీ యుఎస్ చాంపియన్ అయిన మారిన్ సిలిచ్‌ను ఓడించి జకోవిచ్‌తో తలపడడానికి సిద్ధమైనాడు.

ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఐదుసెట్లు పోరాడాల్సి వచ్చిన సిలిచ్ ఈ మ్యాచ్ రెండో సెట్ మధ్యలో వెన్ను నొప్పికి చికిత్స చేయించుకోవలసి వచ్చింది. మరోవైపు నిలకడగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో సర్వ్‌లు చేస్తూ వచ్చిన రవోనిక్ ప్రత్యర్థిని బాగానే ఇబ్బంది పెట్టాడు. మరోవైపు మూడో రౌండ్‌లో ఓటమి అంచులదాకా వచ్చి అదృష్టవశాత్తు విజయం సాధించిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నాలుగో రౌండ్‌లో మాత్రం కేవలం నాలుగు సెట్లలోనే ప్రత్యర్థిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు.

మార్టన్ ఫుక్సోవిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 4 6 తేడాతో చేజార్చుకున్న ఫెడరర్ ఆ తర్వాత మూడు సెట్లను సునాయాసంగా 61,62, 62 స్కోరుతో దక్కించుకొని క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. ఇప్పటికి అరడజను సార్లు ఈ టైటిల్‌ను దక్కించుకున్న ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడం ఇది 15వ సారి. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ అమెరికాకు చెందిన టెన్నిస్ శాండ్‌గ్రెన్‌తో తలపడతాడు. అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లో శాండ్‌గ్రెన్ 76, 75, 67,64 స్కోరుతో 12వ సీడ్ ఫోగ్నినిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.

కోకో విజయ పరంపరకు బ్రేక్
కాగా తొలి రౌండ్‌నుంచే సంచలన విజయాలు నమోదు చేస్తూ వచ్చిన 15 ఏళ్ల చిన్నారి కొకో గౌఫ్ విజయ పరంపరకు బ్రేక్ పడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో తన దేశానికే చెందిన సోఫియా కెనిన్ చేతిలో 67, 63, 60 చేతిలో ఓటమి పాలవడంతో అతి చిన్న వయసులోనే గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న క్రీడాకారిణిగా నిలవాలనుకున్న ఆమె కలలు కల్లలయ్యాయి.

Djokovic and Federer in quarterfinals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News