Sunday, April 28, 2024

వెన్నుపోటు పొడిచే అలవాటు లేదు: డికె

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్‌లో చీలిక తీసుకరానని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివ కుమార్ తెలిపారు. డికె ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 135 ఎంఎల్‌ఎలు కలిసి కట్టుగా ఉన్నారని చెప్పారు. తాను బాధ్యత కలిగిన వ్యక్తిని అని, వెన్నుపోటు పొడిచే అలవాటు తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేయడం లేదని డికె తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డికె శివ కుమార్ పోటీ పడుతున్నారు. డికె శివ కుమార్‌పై ఐటి, ఇడి కేసులు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయని రాజకీయ ప్రముఖులు అనుకుంటున్నారు. సిద్ధరామయ్యకు సిఎం పదవి కట్టబెట్టి డికె శివ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. గెలిచిన 135 ఎంఎల్‌ఎల అభిప్రాయాలను ఎఐసిసి వర్గాలు తీసుకున్నట్టు సమాచారం. 70 మంది ఎంఎల్‌ఎలు రాతపూర్వకంగా, 65 మంది ఎంఎల్‌ఎలు రహస్య ఓటింగ్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది.

Also Read:అమరావతే అతి పెద్ద స్కామ్: సజ్జల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News