Friday, May 3, 2024

రెండోసారి యువ వైద్యుడిని కాటేసిన కరోనా….

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: రెండో సారి కరోనా సోకడంతో యువ వైద్యుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… చిల్డ్రన్ డాక్టర్ నందకుమార్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుండగా మూడు నెలల క్రితం కరోనా వైరస్ సోకింది. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. నెల రోజుల తరువాత విధులకు హాజరయ్యారు. గత 15 రోజుల నుంచి తీవ్రంగా జ్వరం రావడంతో కరోనా టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. జ్వరం ఎంతకు తగ్గకపోవడంతో వైద్యులు సలహా మేరకు తిరుపతి రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ లో యువ వైద్యుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తరలించారు. ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువ వైద్యుడు కన్నుమూశాడు. వైద్యం అందించి ఆదుకోవాల్సిన యువ వైద్యుడు కరోనాతో మృతి చెందడంపై కుటుంబీకులు, తోటి వైద్యులు, సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News