Monday, May 6, 2024

హైదరాబాద్‌లో గన్‌తో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఎంపీ అసదుద్దీన్ ఓవైసి అల్లుడు, డాక్టర్ మజార్ అలీ ఖాన్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లోని తన నివాసంలో మజార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మజార్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన మజార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కుటుంబ తగాదాల కారణంగా మజార్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ మజార్‌పై గృహహింస కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News