Wednesday, May 1, 2024

సాయుధ పోరాటతొలి అమరుడు దొడ్డి కొమరయ్య

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టరు సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరు దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మహనీయులను గౌరవించుకుంటున్నామని, అందులో భాగంగా దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. అమరుల ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుందామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు.
విద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోని ఆశయ సాధన దిశగా ముందుకు సాగాలని అన్నారు. బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మహానీయులను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా దొడ్డి కొమరయ్య వర్ధంతిని అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. దొడ్డి కొమరయ్యతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన చాకలి ఐలమ్మ, కొమరం భీమ్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని, వీరి స్ఫూర్తికి గాను విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఒక కులానికి కాకుండా సమాజం కోసం పోరాడిన వారి చరిత్రను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున రూ.11 వేల కోట్లు కేటాయించి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. వెనుకబడిన తరగతుల వారికి 300 పైచిలుకు గురుకులాలను ఏర్పాటు చేసి మంచి విద్యను అందించడం జరుగుతుందని, బీసీ కుల వృత్తుల వారికి ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, జిల్లా ఆదనపు కలెక్టర్ (రెవిన్యూ) లింగ్యా నాయక్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, సహాయ బిసి సంక్షేమ శాఖ అధికారి భీమరాజు, కౌన్సిలర్ బోండల సువర్ణ అశోక్, కురుమ సంఘం వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు క్రిష్ణ కురుమ, ప్రధాన కార్యదర్శి జైదుపల్లి గోపాల్ కురుమ, మాజీ కౌన్సిలర్ బోండల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నర్సిములు కురుమ, మహిళా నాయకురాలు సుజాత, మాదవ్ కురుమ,సోనియా కురుమ, సరిత శ్రీనివాస్ కురుమ,మల్లేష్, శ్రీనివాస్, మహేష్ కురుమ, వెంకటేష్ కురుమ, నాగభూషణం కురుమ, బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News