Friday, April 26, 2024

లాభాల్లోకి మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్ మంగళవారం మంచి లాభాలను నమోదు చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 562 పాయింట్ల లాభంతో 60,655 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 158 పాయింట్లు లాభపడి 18,053 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 లాభాల్లో ముగియగా, 8 స్టాక్‌లలో క్షీణత కనిపించింది. నిఫ్టీ 50లో ఎల్ అండ్ టి, హిందుస్తాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌సిఎల్ టెక్, టిసిఎస్, రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్రిటానియా సహా 37 స్టాక్‌లు పెరిగాయి.

మరోవైపు ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ సహా 13 నిఫ్టీ స్టాక్‌లు క్షీణించాయి. ఎన్‌ఎస్‌ఇలోని 11 రంగాల సూచీలలో ఎనిమిది లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసిజి రంగం అత్యధికంగా 1.20 శాతం లాభపడింది. రియల్టీ రంగం కూడా 1 శాతానికి పైగా పెరిగింది. బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మెటల్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు కూడా ఊపందుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News