Sunday, April 28, 2024

పునరాలోచించాలి

- Advertisement -
- Advertisement -

Donald Trump H 1B visa suspension

 హెచ్1బి వీసా నిషేధంపై టెక్ పరిశ్రమ నిరసన
ట్రంప్ నిర్ణయం సరికాదన్న భారత్, యుఎస్ సంస్థలు
అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం: నాస్కామ్

న్యూఢిల్లీ: హెచ్1బి, ఇతర నాన్‌ఇమిగ్రేషన్ వీసాలపై 2020 ఆఖరు వరకు ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై టెక్ పరిశ్రమ భగ్గుమంటోంది. ఇటు భారత్, అటు అమెరికాలో టెక్నాలజీ పరిశ్రమ ఈ నిర్ణయం సరైంది కాదని ముక్తకంఠంతో చెబుతోంది. భారతదేశంలోని ఐటి నిపుణులకు హెచ్1బి వీసా చాలా ముఖ్యమైంది. వర్క్ వీసాలతో అత్యంతగా లబ్ధిని పొందుతోన్న భారత్, అమెరికా టెక్ పరిశ్రమ ట్రంప్ నిర్ణయం పునరాలోచించాలని కోరుతున్నాయి. ట్రంప్ పరిపాలనలో అనేక ఇతర విదేశీ వర్క్ వీసాలను కూడా నిలిపివేశారు. ఇందులో హెచ్2బి, ఎల్, జె-వీసా కూడా ఉన్నాయి.

ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఈ వీసా హోల్డర్లు, వారిపై ఆధారపడినవారు 2020 డిసెంబర్ 31 వరకు అమెరికాకు వెళ్ళలేరు. ఇంటర్న్, ట్రైనీ, టీచర్, క్యాంప్ కౌన్సెలర్ లేదా సమ్మర్ వర్క్ ట్రావెల్ ప్రోగ్రాం కోసం జె-వీసా జారీ చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మంది అమెరికన్లకు ఇది అవసరమని డొనాల్ ట్రంప్ ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపార సంస్థలు, మానవ హక్కుల సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ నిరసనను ట్రంప్ తిరస్కరించారు. డొనాల్ ట్రంప్ విధించిన ఈ ఆంక్షలు జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయి. డొనాల్ ట్రంప్ ప్రకటన ప్రకారం, ఈ నిర్ణయం అమెరికా వెలుపల నివసించే ప్రజలను ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం సగటున 85,000 హెచ్ -1 వీసాలు జారీ చేస్తారు. గతేడాది 18,354 మంది భారతీయులకు ఎల్ 1 వీసా జారీ చేశారు.

పట్టించుకోని భారత ఐటి కంపెనీలు

భారతీయ ఐటి కంపెనీలు హెచ్1, ఎల్ 1 వీసాలను నిలిపివేయడాన్ని పట్టించుకోలేదు. నిషేధం విధించినప్పటికీ దేశీయ స్టాక్‌మార్కెట్ టెక్ షేర్లు పెరిగాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో టిసిఎస్, ఇన్ఫోసిస్ షేరు సహా అన్ని ఐటి కంపెనీలు లాభాలతోనే కనిపించాయి. ట్రంప్ ప్రకటన ప్రభావం వీటిపై అంతగా కనిపించలేదు. టిసిఎస్ షేరు 0.54 శాతం పెరిగి రూ .2,039 వద్ద ముగిసింది. విప్రో స్టాక్ 1 శాతం పెరిగి 220 రూపాయల వద్ద ఉంది. ఇన్ఫోసిస్ స్టాక్ అదే సమయంలో 2.34 శాతం పెరిగి రూ .720, హెచ్‌సిఎల్ స్టాక్ 1.04 శాతం పెరుగుదలతో 577 రూపాయల వద్ద ఉన్నాయి. టెక్ మహీంద్రా స్టాక్ 1.64 శాతం పెరిగి 557 రూపాయలకు చేరింది.

ఎక్కడి నుండైనా సేవలు అందించగలవు

భారతీయ ఐటి కంపెనీలు ఎక్కడి నుంచైనా సేవలను అందించగలరని నిపుణులు అంటున్నారు. అమెరికన్ క్లయింట్లు ఉన్న వారు కెనడా, యుకె లేదా యూరప్ నుండి సేవ చేయవచ్చు. అలాగే సాధారణ సేవ కోసం ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ఇది కొత్త ప్రాజెక్టులు చేసే వారిపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే దీనికి ప్రయాణం అవసరం. కోవిడ్ ప్రభావం ఇప్పటికే ఉందని, ఐటిపై ప్రజల ఆధారపడటం పెరిగిందని అంటున్నారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందని, ఈ కొత్త నిషేధం ఎటువంటి ప్రభావం చూపలేదని నిపుణలు భావిస్తున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, టెక్ మహీంద్రా వంటి సంస్థలకు కెనడా, యుకె, యూరప్‌లో కూడా కేంద్రాలు ఉన్నాయని, వారు అక్కడ నుండి అమెరికన్ వినియోగదారులకు సేవ చేయవచ్చని ఐటి ప్రతినిధి అజయ్ శర్మ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News