Monday, May 6, 2024

మగువా.. నువ్ మరణించినా నీ మనోధైర్యానికి హ్యాట్సాఫ్

- Advertisement -
- Advertisement -

Dr Monica tweeted that young woman died fighting with Corona

 

ఢిల్లీ: ఒకవైపు తాను మృత్యువుతో పోరాడుతున్నానని తెలిసినా ఆ యువతి ఏ మాత్రం మనోధైర్యాన్ని కోల్పోలేదు. కొవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తనలాంటి వాళ్లలో స్ఫూర్తి నింపింది. కానీ మహమ్మారి ముందు ఆమె ధైర్యం ఓడిపోయింది. కొవిడ్ చికిత్స సమయంలో 2016లో వచ్చిన షారుఖ్ ఖాన్, అలియా భట్ నటించిన ‘లవ్ జిందగీ’ సినిమాలోని పాటలు వింటూ చలాకీగా ఆడిపాడిన ఈ 30 ఏళ్ల ఢిల్లీ యువతి వీడియో ఇటీవల ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె కోలుకోవాలని పెద్ద ఎత్తున సందేశాలు వెల్లువెత్తాయి. ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ మోనికా గతంలో ఆ వీడియోను పోస్టు చేయడం ఈ యువతి విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా సదరు యువతి కరోనాతో పోరాడుతూ మరణించినట్లు డాక్టర్ మోనికా తాజాగా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ వార్త విన్న నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News