Monday, May 6, 2024

చైనాలో క్యాన్సర్ ఔషధాన్ని ఆవిష్కరించిన తొలి భారతీయ కంపెనీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ చైనాలో క్యాన్సర్ ఔషధాన్ని ఆవిష్కరించబోతోంది. దీంతో చైనాలో కాలూనుతున్న తొలి భారతీయ ఔషధ కంపెనీ  డా.రెడ్డీస్ ల్యాబరేటరీస్ అని చైనాలోని భారత రాయబారి చిన విక్రమ్ మిస్రీ బుధవారం తెలిపారు.

ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ‘అబిరాటెరోన్ అసిలేట్ ’ను 2020లో అమెరికాలో ఆవిష్కరించారు. ఇదే ఔషధాన్ని చైనాలో ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ఆవిష్కరిస్తున్నది. దీంతో చైనాలో కాలూనుతున్న తొలి భారతీయ ఔషధ కంపెనీ ఇదేనని మిస్రీ ట్వీట్ చేశారు. దీంతో డా. రెడ్డీస్ ల్యాబరేటరీస్‌కు మున్ముందు మరిన్ని విజయాలు సిద్ధించగలవని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చైనాలో రెడ్డీస్ కంపెనీ ఆవిష్కరిస్తున్న ఈ ఔషధం జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన ‘జైటిగా’కు థెరాపటిక్ జనరిక్ వర్షన్ అని చెప్పాలి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ చైనాలో కెనడాకు చెందిన రోటమ్ గ్రూప్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా పనిచేస్తోంది. ఈ జాయింట్ వెంచర్ ‘కున్‌షన్ రోటమ్ రెడ్డీ ఫార్మస్యూటికల్ కంపెనీ లిమిటెడ్(కెఆర్‌ఆర్‌పి)గా అక్కడ బాగా పేరు పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News