Saturday, April 27, 2024

పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉండి నల్గొండకు మంచి నీళ్లు ఇవ్వలేదు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Drinking water not give Nalgonda by Congress Leaders

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉండి కూడా ప్రజలకు సురక్షిత జలాలు అందించలేకపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జులై 30 వరకు మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశామన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని దేశంలో ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నారని, మిషన్ భగీరథ ఫలాలతో ఐదేళ్లలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని ఎర్రబెల్లి ప్రశంసించారు. ఇది తెలంగాణ సాధించిన విజయమని కొనియాడారు. మంచిపని చేస్తే అభినందించే విజ్ఞత కూడా ప్రతిపక్ష పార్టీలకు లేదని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశానికి మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎంఒ స్పెషల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, జడ్‌పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News