Monday, April 29, 2024

మహిళా కండక్టర్‌లకు రాత్రి 8 గంటల వరకే విధులు

- Advertisement -
- Advertisement -
Duties for female conductors until 8 p.m
అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసి ఎండి సజ్జనార్

హైదరాబాద్: టిఎస్‌ఆర్టీసి ఎండిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విసి సజ్జనార్ ఆర్టీసి సంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆర్టీసిని అభివృద్ధి పథంలో నడిపేందకు కృషి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసిలో పనిచేస్తున్న మహిళ కండక్టర్‌లకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని ఆయన అధికారులకు సూచించారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలన్నారు. ఒకవేళ రాత్రి 8 గంటలు దాటిన తరువాత డ్యూటీ వేయాల్సి వస్తే కారణాన్ని హెడ్ ఆఫీస్‌కు తెలియజేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే వినూత్న కార్యక్రమాలతో సజ్జనార్ ఆర్టీసి ఆదాయం పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో మహిళా కండక్టర్‌లు ఎండి సజ్జనార్ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News