Friday, May 3, 2024

స్వేచ్ఛ వ్యవస్థల పోరులో కొత్తగా ‘కృత్రిమ’ సవాలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఇప్పుడిప్పుడే విస్తరిస్తోన్న కృత్రిమ మేధ (ఎఐ) , సంబంధిత అంశాలు న్యాయవ్యవస్థకు కూడా కొన్ని సవాళ్లను విసురుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. ఎఐ ప్రక్రియ క్రమంలో పౌరులకు దక్కాల్సిన నైతిక పరిష్కారాలు కీలకమైనవి. వీటికి సంబంధించి కొన్ని ప్రాధమిక ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. బెంగళూరులో 36వ లాఆసియా సదస్సును ఉద్ధేశించి చీఫ్ జస్టిస్ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. ఉనికి, వ్యక్తి, అధికార వ్యవస్థ స్వేచ్ఛకు నూతన మార్గాలు’ అనే అంశంపై జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. ఇప్పటి ఎఐ సమస్యల నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు వెల్లడించడానికి లేదా తగు హక్కులు పొందడానికి కీలక పాత్ర పోషించేది కేవలం అధికారిక వ్యవస్థనే అని డివై తెలిపారు. ఆసియా పసిఫిక్ న్యాయ వృత్తి సంబంధిత విషయాలపై ప్రతి ఏటా లా ఆసియా తరఫున లా ఆసియా సదస్సు జరుగుతోంది.ఈ ప్రాంతీయ సంస్థలో లాయర్లు, న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, న్యాయ సంస్థల ప్రతినిధుల ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఎవరికి వారు తమ ఉనికిని సరిగ్గా నిర్వచించుకోవడమే లిబర్టీ, జీవన పరిణామానికి ఇది ప్రతీక అవుతుంది. వ్యక్తుల గుర్తింపు సంబంధించి వారు ఎంచుకునే జీవనవిధానాలు ఇదే క్రమంలో వారిని శాసించే అధికారిక వ్యవస్థ కీలక పాత్ర వహిస్తాయి. నిజానికి వ్యక్తుల స్వేచ్ఛ ఖచ్చితంగా అధికారిక వ్యవస్థల ప్రమేయం లేకుండా ఉండాలి. అయితే వివిధ కారణాలతో వ్యక్తులు ఎంచుకునే పద్థతులకు వ్యవస్థలు అడ్డుతగులుతాయి. ఇక్కడ వ్యక్తుల స్వేచ్ఛ ఎంపిక ఇదే దశలో సామాజిక ఈర్షాద్వేషాలు, తలెత్తే అంతరాలు, అంతస్తుల విషయం కూడా పరిగణనలోకి వస్తుంది. సునిశిత స్వేచ్ఛ విషయంలో అధికారిక వ్యవస్థల జోక్యం లేకపోతే అది చివరికి వేరే స్థితికి దారితీస్తుంది. పలు వర్గాలు చివరికి ఇది సామాజిక , ఆర్థిక పెట్టుబడుల వ్యవస్థలు వర్గాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని చివరికి చారిత్రకంగా వాటిని బలహీనపరుస్తాయని హెచ్చరించారు. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ ఇంగ్లీషు తత్వవేత్త జాన్ స్టూర్ట్ మిల్ లిబర్టీపై 1859లో రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు. ఇందులో పౌరుల స్వేచ్ఛ , అథార్టీ మధ్య పోరును ప్రముఖంగా ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News