Tuesday, April 30, 2024

తెలుగు రాష్ర్టాల్లో భూప్రకంపనలు…

- Advertisement -
- Advertisement -

Earthquake

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, ఎపిలోని గుంటూరు, కృష్షా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2.37 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైందని అధికారులు తెలిపారు. మంచి నిద్రలో ఉండగా ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో భయంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. కాగా, సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం గణతంత్ర దినోత్సవం రోజునే ఖమ్మంలోని పాతర్లపాడు, నాగులవంచ గ్రామాల్లో భూమి కంపించిందని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు.

కాగా, రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో భూప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. హుజూర్‌నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం, పాలకీడు మండలాల్లో 45 సెకన్ల పాటు భూమి కంపంచింది. దీంతో స్థానికులు బయపడుతున్నారు. చింతలపాలెం మండలంలో ఇరవై రోజుల్లో 40 సార్లు భూ ప్రకంపనలు స్థానికులు అంటున్నారు. గత అర్ధరాత్రి వచ్చిన ఈ భూ ప్రకంపణలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయని స్థానిక అధికారులు చెబతున్నారు.

Earthquakes in Andhra Pradesh And Telangana At Night

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News