Saturday, May 4, 2024

ఈక్వెడార్ జైలులో ఘర్షణ : 68 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Ecuadorian prison clash: 68 killed

 

క్విటో (ఈక్వెడార్ ) : ఈక్వెడార్ లోని గ్వాయాక్విల్ నగరం లోని లిటోరల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తి 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖైదీల నుంచి పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 900 మంది పోలీసులు ఎనిమిది గంటల పాటు శ్రమించి పరిస్థితిని అవుపు లోకి తీసుకొచ్చారు. మరో వైపు జైలు నుంచి భారీ పేలుడు పదార్దాలు రావడంతో స్థానిక ప్రజలు ఉలిక్కి పడ్డారు. జైలులో భారీ ఎత్తున మరణాలు సంభవించడంతో ఖైదీల బంధువులు కారాగారం వద్ద ఆందోళనకు దిగారు. తమ వారు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలపాలని జైలు అధికారులను నిలదీశారు.

మరో వైపు జైలులో జరిగిన మారణ హోమానికి సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడం, కొన్నింటిని కాల్చి వేయడం, అందులో కనిపిస్తోంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాకు చెందిన రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణలు తలెత్తినట్టు తెలుస్తోంది. దుండగులు గోడను డైనమైట్‌తో పేల్చేందుకు ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. జైల్లోకి వెళ్లే సరకుల వాహనాలు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు ఖైదీలకు చేరినట్టు భావిస్తున్నారు. రెండు నెలల క్రితం మరో జైలు లోనూ ఇదే తరహాలో ఘర్షణలు తలెత్తగా 118 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News