Tuesday, September 17, 2024

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

Eight people were killed after a truck overloaded in UP

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కౌశింబిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాధాధామ్ కోట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవిగంజ్ క్రాస్ రోడ్డులో ట్రక్కు ఓవర్ టర్నింగ్ కావడంతో కారుపై పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులలో ఇద్దరు పిల్లలు, ఆరుగురు మహిళలు, డ్రైవర్ ఉన్నారు. కారులో వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులకు సహాయం చేస్తామని జిల్లా అధికారి అమిత్ సింగ్ తెలిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News