Sunday, May 12, 2024

నాణ్యమైనవా…. నకిలీవా ?

- Advertisement -
- Advertisement -

ఎలక్ట్రానిక్ వాహనాల తయారీకి వాడే బ్యాటరీల
నాణ్యతలో స్పష్టత కరువు
బ్యాటరీల నాణ్యత గుర్తించేందుకు ల్యాబరేటరీ ఏర్పాటు !
ప్రణాళికలు రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇక నుంచి టిఎస్ రెడ్‌కో వద్ద వివరాలు నమోదు చేయని
ఈ బైక్ కంపెనీలకు చెక్ పెట్టేలా విధి, విధానాలు

Okinawa to recall 3215 praise pro electric scooters
మనతెలంగాణ/హైదరాబాద్:  వరుసగా ఈ వెహికల్స్ (ఎలక్ట్రిక్ బైక్‌లు) పేలిపోతుండడంతో వాటి బ్యాటరీల నాణ్యతను పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో బ్యాటరీల నాణ్యతను గుర్తించే ల్యాబరేటరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. బ్యాటరీ తయారయినప్పుడు వాటి నాణ్యతను పరీక్షించడానికి దేశవ్యాప్తంగా ల్యాబరేటరీలు లేవు. తమిళనాడులో ఉన్న ల్యాబరేటరీని ఒక ప్రైవేటు కంపెనీని ఏర్పాటు చేసింది. అక్కడ బ్యాటరీల నాణ్యత పరీక్షించడానికి సరైన సిబ్బంది లేక నాణ్యత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1,000 బ్యాటరీల నాణ్యతను ఆ ఆ ల్యాబరేటరీలో పరీక్షించాల్సి వచ్చినప్పుడు అక్కడి సిబ్బంది 10 లోపు బ్యాటరీలను చెక్ చేసి మిగతావి కూడా ఒకే అని సర్టిఫికెట్ ఇస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం గుర్తించింది. అయితే బ్యాటరీ తయారీ సందర్భంలో సెల్స్, మాడ్యూల్స్ లోపభూయిష్టంగా ఉందా లేదా అన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధారించుకుంటే ఇలాంటి పేలుళ్లకు అవకాశం ఉండదని టిఎస్ రెడ్‌కో అధికారులు పేర్కొంటున్నారు.

Exploded electric bike in Karimnagar

4 వీలర్ ఎలక్ట్రానిక్ వాహనాల్లో నాణ్యమైన….

అయితే 4 వీలర్ ఎలక్ట్రానిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలకు టూ వీలర్ ఎలక్ట్రానిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలకు నాణ్యతలో చాలా వ్యత్యాసం ఉంటుందని వాటి నాణ్యతను కచ్చితంగా చెక్ చేయించడంతో పాటు నాణ్యమైన బ్యాటరీలను వాడుతారని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కడ కూడా 4వీలర్ ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీలు పేలడం తక్కువని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ 2 వీలర్, 4 వీలర్ ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీల నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవాలంటే రాష్ట్రంలో ఆర్‌డి ఉండే ల్యాబ్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

టిఎస్ రెడ్‌కో దగ్గర వివరాలు నమోదు చేసేలా….

అయితే వరుస సంఘటనల నేపథ్యంలో బ్యాటరీ ఈ వెహికల్స్ అమ్మే కంపెనీలు కచ్చితంగా టిఎస్ రెడ్‌కో దగ్గర తమ వివరాలను నమోదు చేసుకునేలా వాటి నాణ్యత ప్రమాణాలను తెలియచేసేలా రాష్ట్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందిస్తున్నట్టుగా సమాచారం. అందు లో భాగంగా ముందు జాగ్రత్తగా ల్యాబరేటరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.
తమిళనాడులో ల్యాబరేటరీలో ఆర్‌డి వ్యవస్థ సరిగ్గా లేక…. ప్రస్తుతం ఈ బైక్‌లను అమ్మే కంపెనీలు అధికంగా పుట్టుకొస్తుండడంతో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీకి వాడే బ్యాటరీలు నాణ్యమైనవా లేక నకిలీవా అన్నదానిపై స్పష్టత కొరవడింది. దీంతో టూ వీలర్ వాహనాల బ్యాటరీలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పేలిపోతున్నాయి.

నాణ్యమైన బ్యాటరీలను చెక్ చేసేందుకు దేశంలో ల్యాబరేటరీలు లేవు. తమిళనాడులో ప్రైవేటు ల్యాబరేటరీ ఉన్నా అక్కడ ఆర్‌డి వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వాహనాల బ్యాటరీల నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి అంటే మరిన్ని ల్యాబ్‌లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ల్యాబరేటరీలు లేవు.

లిథియం అయాన్‌తో బ్యాటరీలు…

VK saraswat raises questions on imported battery

 

విద్యుత్ వాహనాల్లో బ్యాటరీనే కీలకం. ఎక్కువగా లిథియం అయాన్‌తో రూపొందించే బ్యాటరీలను వాహనాల్లో ఉపయోగిస్తున్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీలో ఎక్కువగా చిన్న సంస్థలు ఉన్నాయి. తక్కువ ఖరీదుకే వాహనాలను అందించాలన్న ఉద్ధేశంతో తక్కువ ధరలో వచ్చే బ్యాటరీలను వినియోగిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అయితే విద్యుత్ వాహనాలు తయారు చేసే కంపెనీలు నాసిరకం లిథియం ఆయాన్ బ్యాటరీల వాడకంతో పాటు బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (బిఎంఎస్) సక్రమంగా పనిచేయకపోతే అధిక ఛార్జింగ్‌తో పేలుళ్లు జరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News