Thursday, May 16, 2024

బిటెక్ విద్యార్థి కిడ్నాప్..పెట్రోల్ పోసి హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దూరపు బంధువైన బాలికతో సంబంధం పెట్టుకున్నందుకు ఆ బాలిక ్బంధువులు ఒక 18 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి పెట్రోల్ తో గలబెట్టేందుకు ప్రయత్నించారు. 80 శాతం కాలిన గాయాలతో ఆ బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జులై 15వ తేదీన ఈ దారుణ సంఘటన జరిగింది.

స్థానిక ఎసిఎస్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రంగనాథ్ కుమారుడు శశాంక్ శనివారం కాలేజ్‌కి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా కుబల్‌గోడులోని కనిమినికె టోల్ గేట్ సమీపంలో అతనిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించారు. తీవ్రంగా గాయపడిన శశాంక్‌ను అతని స్నేహితులు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు.

తన దూరపు బంధువైన ఒక బాలికతో శశాంక్ ప్రేమలో పడ్డాడు. అయితే బాలిక కుటుంబ సభ్యులు ఈ బంధాన్ని అంగీకరించలేదు. ఆమెకు దూరంగా ఉండాలని వారు శశాంక్‌ను హెచ్చరించారు. జులై 11న ఆ బాలిక శశాంక్ ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక బంధువులు శశాంక ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేశారు. శశాంక్‌ను కొట్టి ఆ బాలికను బలవంతంగా తీసుకెళ్లిపోయారు.

శనివారం(జులై 15) ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తన కాలేజ్ నుంచి బెంగళూరు-మైసూరు రోడ్డు వైపున శశాంక్ వస్తుండగా రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ సమీపంలో ఇన్నోవా కారులో వచ్చిన కొందరు వ్యక్తులు శశాంక్‌ను అడ్డగించారు. బలవంతంగా కారులో లాగేశారు. ఆ కారులో తన మామ మను కూడా ఉన్నాడని, తనకళ్లకు గంతలు కట్టి తీవ్రంగా కొట్టారని శశాంక్ పోలీసులకు తెలిపాడు. కారు ఆపి తనను కిందపడేసి తనపైన పెట్రోల్ పోసి నిప్పంటించారని అతను తెలిపాడు. మట్టిలో పొర్లి ఎలాగోలా మంటలను ఆర్సేసుకున్నానని, అటుగా వెళుతున్న ఒక వ్యక్తితో తన స్నేహితులకు ఫోన్ చేయించి రప్పించానని అతను చెప్పాడు. వెంటనే తన స్నేహితులు తనను విక్టోరియా ఆసుపత్రికి తరలించారని అతను తెలిపాఉడ. కుంబల్‌గోడు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News