Sunday, May 12, 2024

సర్వ మతాలకు సమ ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

పర్వతగిరి: సమైక్య పాలనలో ఆదారణ లేక ప్రభావాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్ వైభవం సంతరించుకుంటున్నాయని బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని అన్నారం షరీఫ్ హజ్రత్ సయ్యద్ యాకూబ్ షా వలి దర్గాలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు.

ఒక నాడు ఆధ్యాత్మికతకు ఆలవాలంగా వెలుగు వెలిగిన దేవాలయాలు, మసీదు, చర్చిల్లో సమైక్య పాలనలో చీకట్లు ఆలుముకున్నాయని, పట్టించుకునే పాలకులు లేక ప్రాశస్తాన్ని కోల్పోయే స్థితికి చేరుకున్నాయన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలయాలకు పునర్జీవం పోశారని, చిన్న గుడి నుంచి పెద్ద ఆలయాల వరకు దూప దీప నైవేద్యం పథకాన్ని వర్తింపచేస్తూ వెలుగు నింపుతున్నారన్నారు.

మైనార్టీ ప్రార్థనా మందిరాలకు సైతం పూర్వ వైభవం తెచ్చారని, సర్వ మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ సర్వమత సామరస్యాన్ని చాటుతున్నారన్నారు. దూప దీప నైవేద్య పథకం ద్వారా ఆలయ అర్చకులకు రూ. 6 నుంచి 10 వేల గౌరవ వేతనాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో 36 ఆలయాల్లో దూప దీప నైవేద్య పథకం అమలవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మసీదు కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News