Sunday, May 5, 2024

పీవీ వల్లే నేను రాజకీయాల్లో ఇంతగా ఎదిగాను: ఎర్రబెల్లి

- Advertisement -
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీవీ చిత్ర పటానికి పూలు చల్లి, ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీ లు బండా ప్రకాశ్, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ”అఖండ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగు వాడు… తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. పీవీ మేధావి, బహుభాషావేత్త, కవి, రచయిత, అనువాదకుడు. అపార జ్ఞానం ఉన్నవాడు. అపర చాణక్యుడు. రాజనీతి పరాయణుడు తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత. ఆచరణ శీలి ఆర్థిక సంస్కరణలు చేపట్టిన ఆర్థిక వేత్త. ఆర్థిక సంస్కర్త. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి పదవులు చేపట్టిన ఆయన
ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని కాపాడారు.
దేశ రక్షణ కొరకు అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. పివితో నాకు చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉంది.ఆయన, మా నాన్న ఇద్దరు కలిసి అనేక ఉద్యమాల్లో పని చేశారు. మా నాన్న పీవీ శిష్యుడు. రాజకీయాల్లో నేను ఇంతగా ఎదగడానికి పివీనే కారణం. పీవీ దగ్గరకు నన్ను మా నాన్న తీసుకుపోయేవారు. రాజకీయాలు మా నాన్నకు పెద్దగా అచ్చి రాలేదు అని అంటుండేవారు. ఆ మాటలే నన్ను బాగా తోలిచేవి. పీవీ మాటలను ఛాలెంజ్ గా తీసుకుని, నేను రాజకీయాల్లో ఎదిగాను. నా నియోజకవర్గ ప్రజలు, సీఎం కెసిఆర్ ఆశీస్సులతో మంత్రిగా ఉన్నాను. పీవీకి భారతరత్న ఇవ్వాలని, ఆయన చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టాలని కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా కెసిఆర్ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూన్నాను” అని పేర్కొన్నారు.
Errabelli pays tribute to PV Narasimha Rao in Delhi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News