Friday, April 26, 2024

తీరు మారకపోతే 50% బెడ్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

ఇప్పటికైనా మానవతాకోణంలో వ్యవహరించండి, లేదంటే కఠిన చర్యలు
అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఆసుపత్రులకు మంత్రి ఈటల హెచ్చరిక
అవసరమైతే ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన కేంద్ర బృందం

Minister KTR Begins Bairamal Guda Flyover

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా చికిత్స విషయంలో తీరు మార్చుకోవాలని లేని యెడల ఐసియూతో పాటు అన్ని వార్డులలో 50 శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆయా బెడ్లలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం చికిత్సలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనవతా కోణంలో వ్యహరించాలని లేదంటే కఠినమైన చర్యలు తప్పవని ఆయన మండిపడ్డారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌పై ప్రజల నుంచి లిఖితపూర్వకంగా వచ్చిన ఆరోపణలపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 1039 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో ముఖ్యంగా అధిక బిల్లులపైనే కంప్లైట్స్ ఎక్కువ శాతంలో ఉన్నాయన్నారు. అంతేగాక బి ల్లులు ఇవ్వకుండా డబ్బులు తీసుకోవడం, మూ డు నుంచి నాలులు లక్షల రూపాయలు అడ్వా న్స్ చెల్లిస్తేనే తప్ప హాస్పిటల్స్‌లో చేర్చుకోకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు బెడ్లు ఖాళీగా ఉన్నప్పటికీ కనీసం పరీక్ష చేయకుండానే తిప్పిపంపించడం వంటివి కూడా చేస్తున్నారన్నారు. అంతేగాక ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు అంగీకరించకపోవడం, డబ్బులు చెల్లించినా కూడా రోగులను సరిగా పట్టించుకోకపోవడం కూడా ఉన్నాయన్నారు. చనిపోతే డబ్బులు చెల్లించపోతే డెడ్‌బాడీలు ఇవ్వడంలేదంటూ ఫిర్యాదులు వచ్చాయన్నారు.

మరోవైపు కరోనా లేని వారి దగ్గర కూ డా కరోనా ఉందా? లేదా తెలుసుకోవడానికి ప రీక్షల పేరుతో డబ్బులు వసూల్ చేయడంపై కూ డా పలు ఫిర్యాదులు అందాయన్నారు. వేరే జ బ్బుల కోసం చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్‌కు వచ్చిన వారిని కరోనా నిర్ధారణ పరీక్షలు, ప్యాకేజీ కోసం డబ్బులు వసూల్ చేస్తున్నారని మంత్రి అన్నారు. వాస్తవానికి కరోనా నిర్ధారణ కోసం ర్యాపిడ్ పరీక్ష లేదా ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేసుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు ఉన్నాయని, కానీ అవి పక్కనపెట్టి సిటీ స్కాన్, ఎక్స్‌రే, రక్తపరీక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రక్తపరీక్షల్లో కూడా డి డైమర్, ఎల్‌డిహెచ్, సిఆర్‌పి, ఫెరిటిన్, ఐల్ 6 లాంటి పరీక్షలను అవసరం లేకున్నా కూడా చేస్తున్నారని పలువురు బాధితులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈక్రమంలో ఇప్పటికే ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులన్నింటికి షోకాజ్ నోటీసులు ఇచ్చి, వివరణ కోరామని తెలిపారు. అంతేగాక ఆసుపత్రుల పరిశీలించడానికి ఒక కమిటీని వేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వివరణలో తప్పులుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స విధానంపై కేంద్ర బృందం ఆరా..
రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న చికిత్స విధానంపై కేంద్ర బృందం ఆరా తీసింది. నిబంధనలు ఉల్లంఘించిన హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది. అవసరమైతే ఎపిడమిక్ డిసిజ్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం సూచించిందని మంత్రి తెలియజేశారు.

Etela Rajender review allegations on Private Hospitals 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News