Friday, April 26, 2024

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కు పాజిటివ్

- Advertisement -
- Advertisement -

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కు పాజిటివ్
త్వరగా కోలుకోవాలని పలువురి ఆకాంక్ష

EX PM Pranab Mukherjee test positive for Corona

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ద్వారా తెలియజేశారు. వేరే వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ఆస్పత్రికి వెళ్లినప్పుడు తనకు కరోనా నిర్ధారణ అయిందని ప్రణబ్ తెలిపారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని 84 ఏళ్ల మాజీ రాష్ట్రపతి కోరారు. ప్రణబ్ ఆరీ ఆస్పత్రిలో చేరారు. కాగా ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలంటూ వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఆకాంక్షించారు. ‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాగా తన తండ్రి త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలంటూ ప్రార్థించాలని దేశ ప్రజలను కోరుతున్నట్లు ప్రణబ్ కుమారుడు అభిజీత్ ముఖర్జీ కూడా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రణబ్‌కు మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ చేసి విజయవంతంగా తొలగించామని, ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని డాక్టర్లు సోమవారం రాత్రి తెలిపారు.

EX PM Pranab Mukherjee test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News