Friday, April 26, 2024

భార్య రూపురేఖలో మైనపు బొమ్మ (వైరల్)

- Advertisement -
- Advertisement -

Wax Statue Of Wife at karnataka

కర్నాటక: ఓ భర్త మృతి చెందిన తన భార్యకు ఏకంగా మైనపు విగ్రహం చేయించారు. ఆమె లేని లోటు ఇంట్లో కనిపించకూడదనుకున్నాడు. అనుకున్నదే అమలుపరిచాడు. ఈ ఘటన కర్నాటకలో జరిగింది. కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా భార్య కొన్నాళ్లు క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇటీవల శ్రీనివాస్ గుప్తా గృహప్రవేశం చేశారు. ఈ వేడుకలో తన భార్యలేని లోటు తెలియకూడదని ఆమె మైనపు విగ్రహం చేయించి ఇంట్లో ఉంచారు. ఆమె సోఫాలో కూర్చున్నట్టు ఆండే ఆ విగ్రహంతో కుటుంబ సభ్యులు పోటోలు దిగి మురిసిపోయారు. జీవ కళ ఉట్టిపడుతున్న ఆ విగ్రహం గురించి ఎవరైనా చేప్తే గానీ తెలిసేలా లేదు. ఆ నవ్వు, చీర, నగలు అచ్చం ఆమె ఇంట్లోనే ఉందా అని అందరు నమ్మేలా ఉంది కదా ఈ మైనపు బోమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Wax Statue Of Wife at karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News