Wednesday, November 6, 2024

నగరంలో మాజీ రౌడీ షీటర్ హత్య

- Advertisement -
- Advertisement -

Ex rowdy sheeter murder in Sanath Nagar

హైదరాబాద్: నగరంలోని సనత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఆర్కే సొసైటీ లో ఉంటున్న మాజీ రౌడీషీటర్ ఫిరోజ్ పై గుర్తుతెలియని వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఫీరోజ్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వెద్యులు తెలిపారు. స్థానికుల సమాచారం తో ఘటనాస్థలానికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం హత్య జరిగిన తీరును పరిశీలించారు. స్థానికంగా ఉండే సిసి టివి ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు గతంలో రౌడీ షీటర్ వాహిద్ హత్య కేసులో ఫిరోజ్ ఎ1 గా ఉన్నాడని తెలిపారు. పాత కక్ష్యవల్లే వాహిద్ అనుచరులే ఫీరోజ్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సనత్ నగర్ పోలీసులు వెల్లడించారు.

Ex rowdy sheeter murder in Sanath Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News