Thursday, May 9, 2024

టీకా వేసుకున్నాక వ్యాయామంతో పెరిగిన యాంటీబాడీల స్థాయి

- Advertisement -
- Advertisement -
Exercising after getting Covid vaccine boosts antibodies
అమెరికా లోని లోవా స్టేట్ యూనివర్శిటీ అధ్యయనం వెల్లడి

వాషింగ్టన్ : కరోనా టీకా పొందిన తరువాత వ్యాయామం వల్ల శరీరం లోని యాంటీబాడీల స్థాయి పెరుగుతోందని అమెరికా లోని లోవా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ఫ్లూ సోకిన తరువాత లేదా టీకా తీసుకున్న తరువాత కానీ తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా, అలాగే మోస్తరు నుంచి తీవ్రంగా 90 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే శరీరంలో యాంటీబాడీల స్థాయి పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ బ్రెయిన్‌లో వెల్లడయ్యాయి. వ్యక్తి ప్రవర్తన, రోగనిరోధక శక్తి నేరుగా ఆ వ్యక్తి ఫిట్‌నెస్ స్థాయిలు పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు వివరించారు. ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న అభ్యర్థులు టీకా తీసుకున్న తరువాత రోజూ గంటన్నర సేపు సైకిల్ తొక్కడం లేదా వేగంగా నడవడం చేయగా, నాలుగు వారాల్లో వారికి యాంటీబాడీల స్థాయిలు బాగా పెరిగాయని, వ్యాయామం చేయలేని వారిలో ఇలా జరగలేదని పరిశోధకులు గమనించారు.

ఎలుకలతో,ట్రెడ్‌మిల్స్‌తో కూడా ఇలాంటి ప్రయోగాలు చేయగా ఫలితాలు ఈ విధంగానే వచ్చాయి. 2021 మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో 36 మందికి ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చి ప్రయోగాలు చేశారు. ఇదే విధంగా 28 మందిపై సీజనల్ ఇన్‌ప్లుయెంజాకు టీకా రెండు డోసుల ప్రయోగం చేశారు. ప్రయోగాల్లో పాల్గొన్నవారిలో సగానికి సగం మంది ఎక్కువ బరువు లేదా స్థూలకాయుల కేటగిరికి చెందిన వారు. 90 నిమిషాల వ్యాయామ సమయంలో వారు నడిచే దూరం కన్నా వారి గుండె నిమిషానికి 120 నుంచి 140 సార్లు కొట్టుకునేలా దృష్టి కేంద్రీకరించారు. 45 నిమిషాల వ్యాయామ సమయంలోనూ ఇలాగే జరుగుతోందా లేదా పరిశీలించారు. తక్కువ సమయం వ్యాయామంలో యాంటీబాడీల స్థాయి పెరగడం లేదని తెలుసుకున్నారు. సుదీర్ఘకాలం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వ్యాయామం వల్లనే యాంటీబాడీల స్థాయి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని లోవా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మారియన్ కొహుట్ పేర్కొన్నారు. ఇలా వ్యాయామం ఎక్కువసేపు ఎక్కువ కాలం చేస్తే శరీరంలోని రక్త ప్రసరణ, శోషరస ప్రవాహం (లింఫ్ ఫ్లో) బాగా వ్యాపించి ఇమ్యూన్ కణాలు మరింత విస్తరించడానికి ఇమ్యూనిటీ స్పందన పెరగడానికి వీలవుతుందని వివరించారు.

శరీరం లోని ఇతర వేరే కణాలను కూడా గ్రహించి వాటిని తొలగిస్తాయని చెప్పారు. ఎలుకల ప్రయోగం నుంచి వచ్చిన డేటాలో వ్యాయామం సమయంలో ఒకరకమైన ప్రొటీన్ ఉత్పత్తి అవుతుందని, వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీలు, టి సెల్స్ ఉత్పత్తి అవుతాయని వెల్లడైంది. ఇలా ఎందుకు ఇలా జరుగుతుందో తగిన సమాధానం కోసం మరింత పరిశోధన విస్తృతంగా నిర్వహించాలని కొహుట్ సూచించారు. మనం వ్యాయామం చేసినప్పుడు జీవక్రియ, జీవరసాయన క్రియ,న్యూరో ఎండోక్రైన్, ప్రసరణ ఈ ప్రక్రియలన్నీ జరుగుతాయని వివరించారు. ఈ అంశాలన్నీ యాంటీబాడీల స్పందనను పెంచడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. టీకా తీసుకున్న వారిలో ఆరుమాసాల వరకు యాంటీబాడీల స్పందన ఏ విధంగా ఉంటుందో పరిశోధన సాగిస్తున్నారు. ఇదే విధంగా బూస్టర్‌డోసు తీసుకున్నవారిలో యాంటీబాడీల స్పందన తెలుసుకోడానికి పరిశోధన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News