Wednesday, May 1, 2024

 ‘ఎట్స్‌ట్రా-ఆర్టినరీ మ్యాన్’ టీజర్.. బాహుబలిలో జూనియర్ అర్టిస్ట్ గా నితిన్

- Advertisement -
- Advertisement -

లవర్ బాయ్ హీరో నితిన్, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎట్స్‌ట్రా-ఆర్టినరీ మ్యాన్’. ఈ మూవీకి రైటర్, డైరెక్టర్ వక్కంతం దర్శకత్వం వహిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్  శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే విడుదల పోస్ట‌ర్‌, డేంజ‌ర్ పిల్ల‌.. సాంగ్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

మ్యూజిక‌ల్ జీనియ‌స్ హేరిష్ జయ‌రాజ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులో నితిన్ జూనియ‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని, సినిమా షూటింగ్‌కు వ‌చ్చిన వారిలో త‌నొక ఎక్స్‌ట్రా మెంబ‌ర్‌గా ఉంటారని అర్థ‌మ‌వుతోంది.  నితిన్ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు స్టైలిష్‌గా ఉన్నాయి. హేరిష్ జ‌య‌రాజ్ సంగీతం ఆక్ట‌టుకుంటోంది.

బాహుబ‌లి 2 ‘దండాల‌య్యా…’ పాటలో జూనియర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించడం హిలేరియ‌స్ ఉంది. శ్రీలీల‌తో నితిన్ ల‌వ్ ట్రాక్‌, తండ్రిగా నటిస్తున్న రావు ర‌మేష్‌తో నితిన్‌ మధ్య సీన్స్ ఆకట్టకున్నాయి. దీంతో  వ‌క్కంతం వంశీ త‌న‌దైన ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌ మూవీస్ అండ్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 8న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News