Monday, April 29, 2024

నకిలీ కాల్ సెంటర్ కేసులో సంచలన విషయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నకిలీ కాల్ సెంటర్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నాలుగు ఏళ్లలో రూ. వెయ్యి కోట్ల మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. కీలక సూత్రాధారి నవీన్ భూటానీ కనుసన్నల్లో నడిచినట్లు విచారణలో వెల్లడైంది. అంతర్జాతీయ క్రెడిటి కార్డు హోల్డర్స్ టార్గెట్‌ చేసి ఈ ముఠా బురుడి కొట్టించింది. యుకె, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల క్రెడిట్ కార్డులకు ఇండియా బ్యాంకులు ప్రాంఛైజీ ఉండడంతో ముఠా ఎంపిక చేసుకుంది. తమ సిస్టమ్‌లో మాల్వేర్ వైరస్ అటాక్ అయ్యిందంటూ క్రెడిట్ కార్డుల డీటైల్స్ తీసుకొని కోట్ల రూపాయలలో మోసం చేసింది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డుహోల్డల్స్ సమాచారాన్ని గూగుల్ యాడ్స్ ద్వారా సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. రెండు టోల్ ఫ్రీ నంబర్ల నుంచి 1.33 లక్షల మంది కస్టమర్లను ముఠా మోసం చేసింది. 80 టెలికాలర్స్ నియమించుకుని ఈ ముఠా కార్యకలాపాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దుబాయ్‌లోను రెండు ముఠాలు ఉన్నట్టు గుర్తించామని, విచారణ కొనసాగుతుందని పోలీసులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News