Monday, April 29, 2024

నభా అందాలకు ఫిదా

- Advertisement -
- Advertisement -

Fans crazy for Nabha Natesh beauties

 

టాలీవుడ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ నేము, ఫేము సంపాదించిన కథానాయికల్లో నభా నటేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సమ్మోహనం సినిమాతో కథానాయికగా తెలుగు తెరపై మెరిసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో వెనుతిరిగి చూడాల్సిన పనే లేకుండా అవకాశాలు అందుకుంటోంది. రవితేజ,- రామ్ లాంటి క్రేజీ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ మునుముందు అగ్ర హీరోల సరసన నటించేందుకు చాలానే ఎత్తుగడలు వేస్తోంది. ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటున్న నభా తదుపరి పలు క్రేజీ చిత్రాల్లో కనిపించనుంది. ఆమె ‘అంధాధున్’ తెలుగు రీమేక్ ‘మాస్ట్రో’లో రాధికా ఆప్టే పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా తన కెరీర్ లో తొలి రీమేక్ అని తెలిపిన నభా.. ఈ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని తెలిపింది. మరోవైపు సోషల్ మీడియాల్లోనూ నభాకి ఉన్న ఫాలోయింగ్ అసాధారణం. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో నభా హీట్ పెంచుతూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ హాట్ ఫోటోకి అభిమానుల స్పందన అసాధారణంగా ఉంది. నభా అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News