Wednesday, May 1, 2024

అశ్విన్‌పై పొగడ్తల వర్షం

- Advertisement -
- Advertisement -

Fans praise Ravichandran Ashwin

 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్న టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లిష్టమైన పిచ్‌పై అశ్విన్ అసాధారణ సెంచరీతో చెలరేగడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. భారత ఆటగాళ్లే కాకుండా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్లు సయితం అశ్విన్ ఆటను కొనియాడారు. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై కళ్లు చెదిరే బౌండరీలతో అశ్విన్ సాధించిన శతకం భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలిచి పోవడం ఖాయమని వారు ప్రశంసించారు. భారత మాజీ ఆటగాళ్లు గవాస్కర్, గంభీర్, లక్ష్మణ్, హర్భజన్, మంజ్రేకర్, రైనాలతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసేర్ హుసేన్, మైఖేల్ వాన్, అథర్టన్ తదితరులు అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News