Tuesday, May 14, 2024

రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Farmers protest news live updates

న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చట్టాల్లో సవరణలపై ప్రతిపాదనలను రైతు సంఘాలకు కేంద్రం పంపింది.  ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామని కేంద్ర తెలిపింది. ఎపిఎంసిలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలకు సుముఖత చూపింది. ఎపిఎంసిల్లో ఒకే పన్ను ఉంటుందన్న సవరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం. ప్రైవేట్ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసేలా సవరణ చేయనుంది. ప్రవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు చేస్తామని కేంద్ర వెల్లడించింది. సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ల అధికారాల సవరణకు కేంద్ర సుముఖత చూపుతున్నట్టు పేర్కొంది.

ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా సవరణలు చేస్తామని సూచించింది. ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించేలా మరో సవరణను చేస్తున్నట్టు కేంద్ర సర్కార్ పేర్కొంది. కనీస మద్దతు ధరపై రాతపూర్వక హమీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదనలు చేయనుంది. పంట వ్యర్థాల దహనం అంశంపై రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం ఒకే చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్లలో ఒకే పన్ను ఉండేలా సవరణకు ప్రతిపాదించింది. సంఘు సరిహద్దులో రైతు సంఘాలు సమావేశమై కేంద్ర ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాలు ప్రకటన చేయనున్నారు.

Farmers protest news live updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News