Thursday, May 9, 2024

విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Farmers won on Central govt

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ నాయకత్వం రైతులకు దొరుకుతుందనే భయమే ప్రధాని ప్రకటనగా తాము భావిస్తున్నామన్నారు. రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువు లేకనే ఇన్ని రోజులు సాగిందా? అని ప్రశ్నించారు. కెసిఆర్ మహాధర్నా రైతులకు నాయకత్వం వహిస్తుందని మోడీ నమ్మారని, ఈ సెగ ఢిల్లీ వరకు చేరుతోందనే భయమే ఈ ప్రకటన చేసిందన్నారు. చట్టాలు ఉపసంహరణ చేసినంత మాత్రాన టిఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. రైతులకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు కెసిఆర్ ఉద్యమం చేస్తారని తెలియజేశారు. విద్యుత్ చట్టాలను మోడీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News