Friday, April 26, 2024

ఫ్లయిట్‌లో ఫైటింగ్..వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఫైటింగ్ జరిగింది. బ్యాంకాక్ నుంచి ఇందియాకు వస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మాటల యుద్ధంతో మొదలై చివరకు అది ముష్టిఘాతాలకు దారితీసింది. శాంతంగా మాట్లాడు అని వ్యక్తి అంటే చేతులు కిందకు దించు ముందు అంటూ మరో వ్యక్తి అనడం వీడియోలో కనిపించింది. వారిద్దరిని శాంతింపచేయడానికి విమాన సిబ్బందితోపాటు వారి మిత్రులు కూడా నచ్చచెప్పడం వీడియోలో చూడవచ్చు. కళ్లజోడు ధరించిన వ్యక్తి తన కళ్లజోడు తీసి అవతలి వ్యక్తిని చెంప దెబ్బ కొట్టగా అవతలి వ్యక్తి ఊహించని ఈ పరిణామానికి షాక్‌తో నిలబడి పోయాడు. ఇంతలో తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది వారిద్దరినీ విడదీసి ఎవరి స్థానాల్లో వారిని కూర్చోపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News