Saturday, September 21, 2024

కరోనాపై కత్తి

- Advertisement -
- Advertisement -

coronavirus

 

రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్

కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

ఎగ్జామ్స్ యధాతథం

ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు
నియంత్రణకు రూ. 500 కోట్లు
మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు… ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం
ర్యాలీలు, సినిమాహాళ్ళు, క్లబ్‌లు, పబ్బుల మూసివేత
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. కేసులు
వైరస్‌ను ఎదుర్కొనేందుకు 1,020 ఐసొలేషన్ బెడ్స్
అన్ని శాఖలతో కలిసి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీం
ఆర్‌టిసి, మెట్రో, మాల్స్‌కు మినహాయింపు
కేబినెట్ భేటీ అనంతరం మీడియా సమావేశంలో కెసిఆర్

సిఎస్ వద్ద రూ.500కోట్ల అత్యవసర నిధి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్రంలోని విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు ఈ నెల 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాలులో శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నతస్థాయి దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం రా్రష్ట్రంలో ఈ వైరస్ ప్ర భావాని కట్టడి చేయడమే లక్షంగా పలు కీలక ని ర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ ప రీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మా త్రం యాథాతథంగా  కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

యదాతథంగా ఇంటర్ టెన్త్ పరీక్షలు
ఇంటర్, పదవ తరగతి పరీక్షలు యథాతథంగా షెడ్యూల ప్రకారం నిర్వహించాలని ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో నాలుగు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే ఆ పరీక్షలు యథాతథంగా పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని నిర్ణయించారు.

శాసనసభ సమావేశాలు కుదింపు
ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమవారంతోనే ముగించాలని నిర్ణయించారు. ఆది, సోమవారాలలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించి, సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. కొన్ని రోజుల పాటు బహిరంగ సమావేశాలు వద్దనీ, విందులు, వేడుకలు ఇంటికే పరిమితం చేయాని సిఎం ప్రజలను కోరారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ మన దేశంలో పుట్టింది కాదని…దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా ఇచ్చారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర పభుత్వం, ఆరోగ్య శాఖ సన్నద్దంగా ఉందన్నారు. వైరస్ నివారణకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా రూ.500 కోట్లతో నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటుందన్నారు. ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతోందన్నారు. మన రాష్ట్రంలో ఎలాంటి పాజిటివ్ కేసులు లేవన్నారు. దేశంలో మొత్తం 83 మందికి కరోనా సోకిగా ఇందులో 66 మంది భారతీయులు, మిగతా వారు విదేశీయులు అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇందులో 10 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు.

ఈ వైరస్ ఒక్కరు నుండి చాలా మందికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. శనివారం ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై సుమారు మూడు గంటల పాటు సిఎం కెసిఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, మంత్రివర్గ సమావేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన దగ్గర వ్యాధి ఉంది…. కాని భయంకరమైన పరిస్థితి లేదన్నారు. మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే తప్ప, ఇక్కడ ఉన్నవారిని ఎవరికీ వ్యాధి సోకలేదన్నారు. ఇతర దేశాల పర్యటనకు వెళ్లిన బెంగళూరు వ్యక్తికి వ్యాధి సోకడంతో అతనికి మన వైద్యలు చికిత్స చేశారని తెలిపారు.

అతను పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ కూడా చేశారన్నారు. ఇప్పటి వరకు మన దేశంలో 83 మంది ఈ వ్యాధికి గురయ్యారని, ఇందులో 66 మంది భారతీయులు, 17 మంది విదేశీయులు ఉన్నారని సిఎం తెలిపారు. వీరంతా విదేశీ పర్యటనకు వెళితే అక్కడ వైరస్ ప్రభావానికి గురయ్యారన్నారు. ఇందులో 10 మంది ఇప్పటికే కోలుకున్నారని సిఎం పేర్కొన్నారు. ఒకరు, ఇద్దరు మాత్రమే వైరస్ ప్రభావంతో మృతి చెందారన్నారు. ముందు జాగ్రాత్త చర్యల్లో భాగంగా మనలను మనం కాపాడుకోవాలంటే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు పోవద్దని సూచిస్తున్నామన్నారు.

1,020 ఐసొలేషన్ బెడ్స్ ఏర్పాటు..
రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ లక్షణాలు ఉన్న వారి కోసం 1020 ఐసొలేషన్ బెడ్స్ అందుబాటులో ఉంచామన్నారు.అలాగే 321 ఐసియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. వీటితో పాటు 240 వెంటిలేటర్లు, 4 క్వారంటైన్ (కొరంటి) ఆసుపత్రులు సిద్ధంగా ఉంచామన్నారు. రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో 200 మంది సిబ్బంది తో వచ్చేవారికి స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా వచ్చే వారిని నుండే వైరస్ సోకుతోందన్నారు. మనకు సముద్రతీరం లేదని, సమస్య మొత్తం హైదరాబాద్ చుట్టూ మాత్రమే ఉంటుందన్నారు. అసెంబ్లీ సమావేశాల కుదింపుపై తాను నిర్ణయం తీసుకోలేనని సిఎం కెసిఆర్ తెలిపారు. దీనిపై స్పీకర్‌తో చర్చించిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామాన్నారు. ఎన్ని రోజుల నిర్వహంచాలన్నది స్పీకర్ విచక్షణ అధికారమన్నారు.

మాస్క్‌లు అధిక ధరలు అమ్మితే కఠిన చర్యలు
కరోనా వైరస్‌ను అడ్డుగా పెట్టుకుని మెడికల్ షాపుల యజమానులు మాస్క్‌లను అధిక ధరలకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. అలాంటి వాటి వివరాలను మీడియా కూడా అందించాలన్నారు. మాస్క్‌లను అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులతో పాటు, ఫాపులను కూడా రద్దు చేస్తామన్నారు. రానున్న ఉగాది, శ్రీరామ నవమి పురస్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని సిఎం కెసిఆర్ ఉన్నారు. అయితే కరోనా వైరఎస్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రార్ధన మందిరాల్లో ముందస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేయనున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు.

ఎంబిబిఎస్ విద్యార్థులకూ…

ఆదివారం నుంచి ఈ నెల 31 వరకు జనాలు ఎక్కువ ఉండే ప్రాంతాలు, విద్యాసంస్థలు, సినిమాహాళ్ళు, పార్కులు, మ్యూజియంలు, క్లబ్‌లు, పబ్‌లు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. ఎవరైనా దీన్ని అతిక్రమణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే బోర్డు పరీక్ష లు యధావిధిగా జరుగుతాయన్నారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో ఉండే విద్యార్థులు పరీక్షలు రాస్తారని, మిగతా విద్యార్తులు ఇంటికి వెళ్తారన్నారు. అలాగే పంక్షన్ హాల్ ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే పెళ్లి డేట్ పిక్స్ చేసుకున్న పెళ్లిళ్లు మాత్రం చేసుకవచ్చునని సిఎం కెసిఆర్ తెలిపారు.

అయితే అన్ని మ్యారేజ్ హాల్స్ మార్చ్ 31 తరువాత జరిగే హాల్స్ కి బుకింగ్ ఇవ్వవద్దు అని… ఒకవేళ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. అలాగే బహిరంగ సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు. స్పోర్టు, జూ పార్కు, ఇండోర్ స్టేడియంలు మూసివేయాలని ఆదేశించినట్లు సిఎం తెలిపారు. అన్ని రకాల స్పోర్ట్ ఈవెం ట్స్ రద్దు చేశామన్నారు. కాగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్‌టిసిబస్సులు, మెట్రో రైల్ సర్వీసులు యధావిధిగా నడుస్తాయన్నారు. షాపింగ్‌మాల్స్ కూడా పనిచేస్తాయన్నారు.
ఎంబిబిఎస్, నర్సింగ్, డెంటల్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే ఫైనల్ ఇయర్, పిజి విద్యార్థులకు ఇది వర్తించబోదని స్పష్టం చేసింది.

అతిగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు
సినిమా హాల్స్, క్లబ్‌లు మూసివేత సోషల్ మీడియాలో కొందరు అతిగాళ్ళు అతిగా ప్రచారం చేస్తున్నారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇందులో మీడియా కూడా అతిగా చేస్తుందని, తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయన్నారు. కేవలం ఆరోగ్యశాఖ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే సమాచారంగా ఇవ్వాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పదన్నారు. తప్పుడు ప్రచారం సమాజానికి మంచిదికాదన్నారు.

 

Fighting on coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News