Sunday, May 5, 2024

బాలుడి ప్రాణం తీసిన టెన్నిస్ బంతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టెన్నిస్ బంతి కోసం వెళ్లిన బాలుడికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం సెలవు దినం కావడంతో తన స్నేహితులతో కలిసి తొమ్మిదేళ్ల బాలుడు టెన్నిస్ బంతితో ఆడుకుంటున్నాడు. బంతి వెళ్లి రేకులపై పడడంతో తీసేందుకు బాలుడు గోడ ఎక్కాడు… ఆ సమీపంలో కరెంట్ తీగలు ఉండడంతో అతడికి తాకాయి. వెంటనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

Film Nagar Boy Died with Current Shock in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News