Friday, April 26, 2024

క్విక్ రెస్పాన్స్

- Advertisement -
- Advertisement -

Fire

కార్చిచ్చులను క్షణాల్లో ఆర్పివేసే బృందాలు

 అడవి మంటలపై మెరుపుదాడులకు ప్రత్యేక టీమ్స్
ఐదుగురు సిబ్బంది, వాహనం, బ్లోయర్లతో క్విక్ రెస్పాన్స్
ఉపగ్రహాల ద్వారా దావానలాలను గుర్తించే విధానం
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సహకారం
వేసవి నేపథ్యంలో కదిలిన అటవీ శాఖ
నల్లమలలో ఆక్టోపస్ వద్ద మరో కార్చిచ్చు
రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలకు అవకాశమున్న 9,771 కంపార్ట్‌మెంట్లు, 1,106 ప్రాంతాల గుర్తింపు

ఆందోళన పడొద్దు, వెంటనే ఆర్పేశాం, రేవంత్ ట్వీట్‌కు ఎంపి సంతోష్‌కుమార్ రీట్వీట్

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో అడవుల్లో కార్చిచ్చు ఘటనలు వెలుగు చూస్తున్నా యి. దీంతో రాష్ట్ర అటవీశాఖ అధికారులు అ ప్రమత్తమయ్యారు. వారం రోజుల్లోనే నల్లమలలో రాసమళ్ళ బావి, ఉర్రుమండ, ఆక్టోపస్ వ్యూ పాయింట్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగిలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అటవీ శాఖ పిపిసిఎఫ్ ఆర్.శోభ స్పందిస్తూ అగ్నిప్రమాదాలపై తక్ష ణం స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా గురువారం అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని ఈగలపెంట సమీపంలో గల ఆక్టోపస్ వ్యూ పాయింట్ అటవీప్రాంతంలో కార్చిచ్చు వల్ల మూడు హెక్టార్లలో అడవి దగ్దమైంది.

మంగళవారం ఉర్రుమండ వద్ద వ్యాపించిన మంట లు ఆక్టోపస్ ప్రాంతం వరకు విస్తరించాయి. అటవీ మార్గంలోని ప్రధాన రహదారుల పై క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయడం ద్వారా సంబంధిత అటవీ శాఖ అధికారుల కు, గ్రామకార్యదర్శితో పాటు 11 వేల 700 మందికి ఫోన్‌ద్వారా సమాచారం అందించే విధంగా ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పడం కుదుర్చుకోవడం జరిగింది. ఫిబ్రవరి నెల నుంచి మే నెల ఆఖరి వరకు అటవీ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి అటవీ ప్రాంతాలకు నిప్పు నివారణపై అవగాహన కల్పించడం, అటవీ ప్రాంతాల్లో వంట చేయడం, సిగరేట్ , బీడీ లాంటివి పడేయకుండా చూడాలని అధికారులను శోభ ఆదేశించారు.

నల్లమలలో జరిగిన రెండు ఘటనలు, ఒకటి పశువులు కాపరీలు, మరొకటి ప్రయాణికుల వల్ల జరిగినట్లు గుర్తించామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో 9771 కంపార్ట్‌మెంట్లకు గానూ 4 3 అటవీ రేంజ్‌లలో 1106 ప్రాంతాలు అగ్నిప్రమాదాలకు అత్యంత ఎక్కువగా ఆస్కారం ఉన్నట్లు గుర్తించినట్టు ఆమె వెల్లడించారు. అందులో అమ్రాబాద్ అడవులు కూడా ఉన్నా యి. నల్లమల అటవీ ప్రాంతంలో వరుసగా జ రుగుతున్న అగ్ని ప్రమాద ఘటనలు అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుం డా చేస్తున్నాయి.

మహాశివరాత్రి సమీపిస్తుండ డంతో అచ్చంపేట నుంచి శ్రీశైలం వరకు ప్ర ధాన రహదారి వెంట ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ అధికారు లు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచార ం. ఆదేశాలతో నల్లమల అ టవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంత అధికారులు క్విక్‌రెస్పాన్స్ టీంల ఏర్పాటుకు సన్నద్ధమైనట్లు తెలిసింది. దీంతో పాటు అదనంగా శివరాత్రి వరకు ప్రత్యేక వాహనాలలో సు మారు 85 కి.మీట ర్ల మేర అటవీ సిబ్బందితో అ నునిత్యం అడవులపై నిఘా ఉంచేందు కు ప్రణాళికలను రూపొందించినట్లు సమాచారం.

ఆందోళన పడొద్దు, వెంటనే ఆర్పేశాం

మన “మీ ఆందోళన అర్థం చేసుకున్నాను.. నల్లమల అడవిలో చెలరేగిన కార్చిచ్చును అటవీశాఖ అధికారులు త్వరితగతిన ఆర్పివేశారు. అదీ మీరు ట్వీట్ చేసేలోపే అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింద”ని ఎంపి రేవంత్ రెడ్డికి సమాధానంగా ఎంపి సంతోష్ కుమార్ ట్విట్ చేశారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌”లో భాగంగా మొక్కలు నాటమని ఛాలెంజ్ విసరడం కాదు.. రాష్ట్రంలో కీలక ప్రాంతమైన నల్లమల అడవిలో చెలరేగుతున్న కార్చిచ్చును ఆర్పివేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇందుకు సంతోష్ రీట్వీట్ చేసి బదులిచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎర్రకురవ ప్రాంతంలోని అడవుల్లో మానవతప్పిదంతో వ్యాపించిన కార్చిచ్చు గురించి సంబంధిత అధికారులు తెలియజేయగా వెంటనే మంటలు ఆర్పివేశారని సంతోష్ ట్వీట్‌లో తెలియజేశారు. ఆ పరిస్థితిని అప్పుడే అదుపుచేయడం జరిగిందని తెలిపారు. మొక్కలు నాటించడమే కాదు వాటి సంరక్షణ చర్యలకు తాను కట్టుబడివుంటానని రేవంత్‌కు చేసిన ట్వీట్‌లో సంతోష్ స్పష్టం చేశారు.

 

fire accident in nallamala forest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News