Friday, May 10, 2024

భారత్‌లో తొలి ‘ఈటా’ వేరియంట్ కేసు

- Advertisement -
- Advertisement -

First ‘ETA’ variant case in Karnataka

కర్నాటకలోని మంగళూరులో వెలుగు చూసిన వైనం

బెంగళూరు: కరోనా వైరస్ జన్యుక్రమాన్ని మార్చుకుని రోజుకో కొత్త రూపం దాల్చుతుండడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ‘ఈటా’ వేరియంట్ ఇప్పుడు భారత్‌కు కూడా వ్యాపించింది. కర్నాటకలో కరోనా వైరస్‌కు సంబంధించి ఈటా వేరియంట్‌గా పిలవబడే 1.525 వేరియంట్ సంబంధించిన తొలి కేసును గుర్తించారు. మంగళూరులో రెండు వారాల క్రితం ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు రాష్ట్ర జెనోమిక్ నిఘా కమిటీ సభ్యుడు డాక్టర్ విశాల్ రావు గురువారం చెప్పారు. బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్‌నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రె గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది. బాధితుడితో సన్నిహితంగా ఉన్న మరో వంద మంది శాంపిళ్లను కూడా సేకరించి పరీక్షలకు పంపించగా, ఆ వ్యక్తిలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి ఆందోళన కలిగించే వేరియంట్‌గా లేదని ఆయన చెప్పారు.

జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం శాంపిళ్లను లేబరేటరీకి పంపంచడానికి, ఫలితం సంబంధిత స్థానిక సంస్థలకు చేరడానికి మధ్య ఉన్న అంతరాన్ని మూడు రోజులకు తగ్గించడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల ఆరోగ్యంపై తగు విధంగా స్పందించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని కూడా ఆయన చెప్పారు. గత మార్చి 5న ఈటా వేరియంట్‌ను 23 దేశాల్లో గుర్తించారు. 2020 డిసెంబర్‌లో బ్రిటన్, నైజీరియాలలో మొదటగా దీనికి సంబంధించిన కేసులను గుర్తించారు. అయితే ఫిబ్రవరి 15 నాటికి ఇది నైజీరియాలో అత్యధిక వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్‌గా గుర్తించారు. బ్రిటన్‌లో ఫిబ్రవరి 24 నాటికి ఈ వేరియంట్‌కు సంబంధించిన 56 కేసులను గుర్తించారు. జనవరి 14నుంచి ఫిబ్రవరి 21 మధ్య కాలంలో డెన్మార్క్‌లో ఈ వేరియంట్‌కు సంబంధించిన 113 కేసులను గుర్తించారు. ఆ దేశం ప్రస్తుతం దీన్ని ‘ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న వేరియంట్’గా గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News