Sunday, May 5, 2024

‘ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన’లో అయోధ్య…

- Advertisement -
- Advertisement -

Kejriwal
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్లకు ఉచితంగా చేసుకునే తీర్థయాత్ర పథకంలో అయోధ్య దర్శనాన్ని కూడా భాగంగా చేర్చింది. అయోధ్యను ‘ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన’లో చేర్చుతామని గత నెలే ప్రకటించారు. కాగా దానికి ఢిల్లీ కాబినెట్ ఇప్పుడు పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన తొలి రైలు ఉత్తరప్రదేశ్ పట్టణానికి డిసెంబర్ 3న వెళుతుందని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. “అయోధ్యకు మా తొలి రైలు డిసెంబర్ 3న బయలుదేరుతుంది. రిజిస్ట్రేషన్లు మొదలెట్టాము” అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజనలో తమిళనాడుకు చెందిన వేలాంకణ్ని చర్చీని కూడా చేర్చినట్లు ఆయన ప్రకటించారు. ఢిల్లీకి చెందిన సీనియర్ సిటిజెన్లు ఉచితంగా ఈ పథకం కింద తీర్థయాత్రలు చేసుకునే వీలుంది.ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరే తొలి రైలులో ఢిల్లీకి చెందిన 1000 మంది సీనియర్ సిటిజెన్లు ఉండనున్నారు. ఢిల్లీ ప్రభుత్వంకు చెందిన ‘తీర్థ యాత్ర వికాస్ సమితి’ చైర్మన్ కమల్ బన్సల్ ఈ వివరాలు తెలిపినట్లు వార్థా సంస్థ కథనం.
ఢిల్లీ ‘ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన’ కింద 13 పవిత్ర స్థలాలకు ఢిల్లీకి చెందిన సీనియర్ సిటిజెన్లు జరిపే యాత్రకయ్యే ఖర్చునంతా ఢిల్లీ ప్రభుత్వమే భరించనుంది. ఈ పథకం కింద కవరయ్యే పవిత్ర క్షేత్రాలలో షిర్డీ, హరిద్వార్, మథుర, వైష్ణోదేవి, బృందావన్, పూరీ తదితరాలు ఉన్నాయి. ఇకపోతే సీనియర్ సిటిజెన్ల వెంట 21 ఏళ్లు లేక అంతకు మించి వయస్సు ఉన్న ఒకరిని అటెండెంట్‌గా కూడా అనుమతిస్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే గోవా, ఉత్తరాఖండ్‌లలో కూడా తాము ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఇలాంటి ఉచిత తీర్థయాత్ర వసతిని సీనియర్ సిటిజెన్లకు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఆయన ఇటీవల ఉత్తరాఖండ్ సందర్శించినప్పుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకం కింద హిందూ సీనియర్ సిటిజెన్లు అయోధ్యలోని రామజన్మభూమికి, ముస్లింలు అజ్మీర్ షరీఫ్‌కు, సిక్కులు పాకిస్థాన్‌లోని కర్తాపూర్ సాహిబ్‌కు, క్రిస్టియన్లు తమిళనాడులోని వేలాంకణ్నికి ఉచితంగా తీర్థయాత్ర చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News