Saturday, April 27, 2024

ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన

- Advertisement -
- Advertisement -

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య


మనతెలంగాణ/హైదరాబాద్:  ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0’ కార్యక్రమాన్ని జిఎం గజానన్ మాల్య, జోన్ అధికారులు, దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, సభ్యులతో కలిసి గురువారం సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్ కాంప్లెక్స్ (ఆర్‌ఎస్‌సీ) గ్రౌండ్స్‌లో జెండా ఊపి ప్రారంభించారు. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 13 ఆగస్టు నుంచి 2 ఆక్టోబర్ 2021 వరకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఫిజికల్/వర్చువల్ రన్’ ప్రచారాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ‘ఫిట్‌నెస్ కా డోజ్ ఆదా గంటా రోజ్’ నినాదంతో ఫిట్ ఇండియా ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతివారు రోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్న ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహిస్తున్నారు.

ప్రజలు శారీరకంగా దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉండాలి: జిఎం

అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన సంస్థలోని రైల్వే సిబ్బందిని వారి కుటుంబ సభ్యులను భాగస్వాములు చేసే విధంగా పెద్ద ఎత్తున ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ గజానన్ మాల్య మాట్లాడుతూ శారీరకంగా దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రజలందరిలో అవగాహన కలిగించేందుకు ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ ప్రచార కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమం ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో ఎంతో అవసరమన్నారు. అనంతరం జిఎం గజానన్ మాల్య ఆర్‌ఎస్‌సీ గ్రౌండ్స్‌లో నూతనంగా పునరుద్ధరించిన షటిల్ బాడ్మింటిన్ కోర్టును ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జయంతి మాల్య రైల్వే పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అడిషినల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.కె.జైన్, వివిధ విభాగాల అధికారులు, ఎస్‌సిఆర్‌డబ్ల్యుడబ్ల్యుఓ సిబ్బంది, సభ్యులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News