Tuesday, April 30, 2024

నేపాల్‌లో కూలిన హెలికాప్టర్: ఐదు మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

కట్మాండు: తూర్పు నేపాల్‌లోని పర్వత శ్రేణులలో మంగళవారం ఉదయం ఆరుగురు ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ వాణిజ్య హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఐదు మృతదేహాలు లభించినట్లు వార్తాసంస్థలు తెలిపాయి.

మంగళవారం ఉదయం 10.04 గంటలకు సుఖుంబు జిల్లాలోని సుర్కే ఎయిర్‌పోర్టు నుంచి కట్మాండుకు బయల్దేరిన మనంగ్ ఎయిర్ ఎన్‌ఎ ఎంవి హెలికాప్టర్ ఉదయం 10.13 గంటలకు 12,000 అడుగుల ఎత్తులో హఠాత్తుగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయిందని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మేనేజర్ జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. సులుఖుంబు జిల్లాలో మారుమూల ఉన్న లకింపికె గ్రామీణ మున్సిపాలిటీ పరిధిలోని లంజూరా ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయిందని ఆయన తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు తెలియరావలసి ఉందని ఆయన చెప్పారు.

లంజూరా కనుమలో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ప్రమాదానికి లోనైనట్లు హిమాలయన్ టైమ్స్ వార్తాపత్రిక తెలిపింది. ప్రమాద స్థలి నుంచి ఐదు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పత్రిక తెలిపింది. హెలికాప్టర్‌లో ఐదుగురు మెక్సికో జాతీయులు, పైలట్ చేత్ బి గురుంగ్ ఉన్నట్లు పత్రిక పేర్కొంది.

1997లో స్థాపించిన మనంగ్ ఎయిర్ కాట్మండులో కేంద్రంలో హెలికాప్టర్ ఎయిర్‌లైన్ నిర్వహిస్తోంది. నేపాల్ పౌర విమానయాన నిబంధనల మేరకు నేపాలీ భూభాగంలో వాణిజ్య వాయు రవాణా సర్వీసులను హెలికాప్టర్ ద్వారా ఈ ఎయిర్‌లైన్స్ అందచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News